×
Ad

Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా స్టేజిపైనే జుట్టు కత్తిరించుకున్న టర్కీ సింగర్.. వీడియో వైరల్

హిజాబ్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు దేశాల్లో మహిళలు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. టర్కీకి చెందిన మహిళా సింగర్ ఒకరు స్టేజిపైనే జుట్టు కత్తిరించుకుని ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.

Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌తోపాటు అనేక దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా మంది మహిళలు రోడ్లపై హిజాబ్‌ను దహనం చేస్తూ, జుట్టు కత్తిరించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Indira Devi: ఇందిరా దేవి మృతిపై చిరంజీవి.. సినీ ప్రముఖుల సంతాపం

ఈ నిరసనలు చేస్తున్న వారిలో తాజాగా టర్కీకి చెందిన సింగర్ మెలెక్ మొస్సో చేరారు. మెలెక్ మొస్సో స్టేజిపై ప్రదర్శన ఇస్తున్న సమయంలో మధ్యలో కత్తెరతో జుట్టు కత్తిరించుకున్నారు. ఇరాన్‌తోపాటు, అనేక దేశాల్లో ఆందోళనలు చేస్తున్న మహిళలకు ఆమె దీని ద్వారా సంఘీభావం ప్రకటించారు. మరోవైపు అనేక మంది నెటిజన్లు మెలెక్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. తమ ఉద్యమానికి ఆమె ఈ విధంగా మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌లో మహసా అమినీ అనే యువతిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో గాయపడ్డ అమినీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 17న మరణించింది.

Mahesh Babu: అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానమన్న మహేశ్ బాబు

దీంతో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు మిన్నంటాయి. వేలాది మంది రోడ్లపైకి చేరి ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 75 మందికిపైగా మరణించారు. మరోవైపు ఈ ఆందోళనలు ఇతర దేశాలకూ పాకాయి. అనేక దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.