Indira Devi: ఇందిరా దేవి మృతిపై చిరంజీవి.. సినీ ప్రముఖుల సంతాపం

మహేశ్ బాబు మాతృమూర్తి, ‘సూపర్ స్టార్’ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ‘మెగాస్టార్’ చిరంజీవితోపాటు, దర్శకులు శ్రీను వైట్ల, బాబీ, టీడీపీ నేత నారా లోకేష్ వంటి ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Indira Devi: ఇందిరా దేవి మృతిపై చిరంజీవి.. సినీ ప్రముఖుల సంతాపం

Indira Devi: మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మృతిపై చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణ వార్త తనను ఎంతగానో కలచి వేసిందని చిరంజీవి అన్నారు. కృష్ణ, మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇందిరమ్మ ఆత్మకు శాంతి కలగాలని నిర్మాత బండ్ల గణేష్, గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.

Mahesh Babu: అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానమన్న మహేశ్ బాబు

ఇందిరమ్మ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని దర్శకుడు బాబీ అన్నారు. ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ నేత నారా లోకేష్ ప్రకటించారు. దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు వీకే నరేష్, ఎంపీ మార్గాని భరత్ తదితరులు సంతాపం ప్రకటించారు.