Tuvalu island : సాగరంలో కలిసిపోయినా చరిత్రలో నిలవాలనే సంకల్పం..ప్రపంచంలోనే తొలి డిజిటల్ దేశంగా ‘Tuvalu’ దీవి..!
సముద్రంలో కలిసిపోయినా చరిత్రలో నిలవాలనే సంకల్పంతో.. ప్రపంచంలోనే తొలి డిజిటల్ దేశంగా అవరించనుంది ఆ అందాల దీవి..!

Tuvalu island : గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరిగిపోతోంది. పర్యావరణవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నా మానవజాతి మేలుకోవటంలేదు. ఈ గ్లోబల్ వార్నింగ్ హెచ్చరికలు పట్టించుకోకపోవటం వల్ల ఎంత పెను ప్రమాదం జరుగుతుందో ఊహించినా మేల్కొనకపోవటం పర్యవసానం మానవజాతి అనుభవించి తీరాల్సిందే. ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలనికి ఇప్పటికే పలు దీవులు సముద్రంలోకి జారిపోతున్నాయి. పెరుగుతున్న సముద్ర మట్టాలు జనావాసాలుగా ఉన్న దీవుల్ని మింగేస్తున్నాయి. ఆయా దీవుల ప్రజలు మాకు జీవించటానికి కాస్త భూమి ఇవ్వండి అని వేడుకుంటున్నాయి. తాము ఇక కొన్నాళ్లలోనే ఈ సముద్రంలో కలిసిపోతామని తెలిసి ఆ దీవుల్లో నివసించే ప్రజలు కొంతమంది వేరే దేశాలకు వలస పోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాని చాలామంది మాత్రం ఇక్కడే పుట్టాం..ఇక్కడే ఛస్తాం అన్నట్లుగా ఆ దీవుల్లోనే మనుగడ సాగిస్తున్నారు.
అటువంటి కొన్ని దీవుల్లో ప్రజలు..ప్రభుత్వాలు కేవలం జీవించటానికి మాత్రమే పోరాడుతున్న క్రమంలో ఓ చిన్న దీవి మాత్రం తాము ఈ సముద్ర గర్భంలో కలిసిపోయినా చరిత్రలో మాత్రం నిలిచిపోవాలని నిర్ణయించుకుంది. దాని కోసం ఆదీవికి సంబంధించిన ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పటంలో చిన్న ‘చుక్క’లా కనిపించే ఆ చిన్నిదేశం తమ దేశపు సంస్కృతి, సంప్రదాయాలు తమలా సముద్రంలో కలిసిపోకూడదని ‘డిజిటల్’ ( digital nation)డెసిషన్ తీసుకుంది. తమ దీవి సముద్రంలో కలిసిపోయినా తమ దేశం మాత్రం ‘డిజిటల్ దేశం’గా నిలిచిపోవాలనుకుంది. దాని కోసం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాము ‘డిజిటల్ దేశం’గా నిలిచిపోవాలని నిర్ణయించింది. ఆ ద్వీపదేశం పేరు ‘తువాలు’..(Tuvalu)!!
పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానాలు చేయటం వాటిని ఆమోదించటం ఆ తరువాత వాటిని మర్చిపోవటం జరుగుతోంది. ఈ నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా ఎన్నో ద్వీపదేశాలు అగుళం అంగుళం చొప్పున సముద్రంలోకి మునిగిపోతున్నాయి. నీటి మీద రాతలుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు కంటితుడుపుగా మారినదానికి ప్రతిఫలింగా ‘తువాలు’ లాంటి ద్వీపదేశాల పరిస్థితులు దిగజారుతున్నాయి. కర్బన ఉద్గారాల కారణంగా నీటిమట్టాలు పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ద్వీప దేశాల భూభాగాలు సముద్రంలో కలిసిపోనున్నాయి. అటువంటి ప్రమాదంలో పడింది ‘తువాలు’ ద్వీపం.
ఇటువంటి పరిస్థితుల్లో ‘తువాలు’ ప్రభుత్వం తమ దేశాన్ని డిజిటల్ దేశంగా మారుస్తామని ప్రకటించింది. ఆస్ట్రేలియా, హవాయిల మధ్య తొమ్మిది దీవుల సమూహంగా ఉన్న ‘తువాలు’లో 12,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ దీవి రాజధాని Funafuti ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదముంది. ఇదే కనుక జరిగితే ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కు బలి అయ్యే తొలి ద్వీపదేశంగా తువాలు అవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూసే అవకాశం ఉంటుందని తువాలు ద్వీపదేశ న్యాయ, సమాచార, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైమన్ కోఫే తెలిపారు. ఎందుకంటే తాము కనుమరుగు అయినా మా ఆనవాళ్లు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నామని.. త్వరలోనే తువాలు తొలి వర్చువల్ దేశంగా ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వబోతోందని చెప్పారు.దీని కోసం ది మంకీస్, కొల్లైడర్ అనే రెండు సంస్థలు టెక్నికల్ వర్క్ పై బిజీబిజీగా ఉన్నాయి. దీంట్లో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు, సంస్కృతీ సంప్రదాయాల వివరాలు, కుటుంబ చిత్రాలు, సంప్రదాయ పాటల వంటి వాటిని నిక్షిప్తం చేయనున్నారు. ఒక దేశం పూర్తిగా మెటావర్స్ సాంకేతికతలోకి మారడం ఇదే తొలిసారి కానుంది. దీనికోసం ఆ దేశం పడే తపనను ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
కాగా.. విస్తీర్ణం పరంగా 26 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. తువాలు ప్రజలు సుమారు 3000 ఏళ్ల క్రితం అక్కడకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారని అలా అక్కడ జనాభా వృద్ధి చెందిందని చెబుతుంటారు. తువాలులో బీచ్‌ల్లో నీరు నిర్మలంగా ఉండి అంత్యంత అందంగా కనిపిస్తాయి. జనాభాలో 42 శాతం మంది చేపల వేటపైనే జీవనం సాగిస్తుంటారు. 1978లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈ దేశంలో 86 శాతం జనాభా క్రిస్టియన్లు. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం నాలుగున్నర మీటర్ల ఎత్తు మాత్రమే ఉండడంతో అంతకంతకు సముద్రపు నీటిలో మునిగిపోతోంది. తువాలు ద్వీపదేశానికి ప్రత్యేకంగా మిలటరీ అంటూ ఉండదు. తువాలు దేశం ప్రతీ ఏటా 6.6 మిల్లీమీటర్ల మేరు సముద్రంలో మునిగిపోతోంది. దీతో ఈ దేశం ఎంతో కాలం మనుగడ సాగించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి ప్రమాదం రాకముందే ఈ దేశం డిజిటల్ దేశంగా మారాలని తమ సంస్కృతి, సంప్రదాయాలు కూడా సముద్రంలో జలసమాధి కాకుడదనే ముందుచూపుతో ఈ ద్వీపదేశం ‘డిజిటల్ దేశం’గా మారటానికి చర్యలుతీసుకుంటోంది.
కాగా 2021లో ‘తువాలు’ విదేశాంగ మంత్రి సైమన్ కోఫే సముద్రంలో మోకాలు లోతు నీటిలో నిలబడి చేసిన ప్రసంగం..పిలుపు ప్రపంచలోని ఏదేశమైనా పట్టించుకుందా?అంటే లేదనే చెప్పాలి? ఎందుకంటే ఈనాటికా ఆదేశం అదే పిలుపునిస్తోంది. కానీ తమ కల కల్ల అవుతుందని భావించిన ఆదేశం మాత్రం ‘డిజిటల్ దేశం’గా మారాలనే సంకల్పించుకుంది.2021లో ‘తువాలు’ విదేశాంగ మంత్రి సైమన్ కోఫే సముద్రంలో మోకాలు లోతు నీటిలో నిలబడి చేసిన ప్రసంగిస్తూ..‘‘ మా దేశాలను కాపాడండీ అంటూ సముద్రంలో నిలబడి కోరారు.ఈ సందేశం ఇచ్చే సందేశం వారి క్షేమం గురించే కాదు యావత్ ప్రాణికోటి కోసం..మనిషి మనుగడ కోసం..అని ఈ ప్రపంచ దేశాలు అర్థం చేసుకుని తగిన చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Read more :Moon resort : చుక్కలను తాకే భవనాల మధ్యలో నేలపై ‘చందమామ’ రిసార్ట్..
వైరల్ అయిన మంత్రి సైమన్ కోఫే పిలుపు..
కాగా 2021లో..సైమన్ కోఫే మాట్లాడుతూ ‘‘మా దేశ భూభాగం క్రమక్రమంగా నీట మునిగి మాయమైపోబోతోంది. ప్రపంచపు తొలి డిజిటల్ దేశం కావడం మినహా మాకు మరొక మార్గం లేదు. మా భూమి, మా సముద్రం, మా సంస్కృతి.. ఇవన్నీ మా ప్రజలకు అత్యంత విలువైన ఆస్తులు. అవి కాలగర్భంలో కలిసిపోకుండా ఉండేందుకు ఈ భౌతిక ప్రపంచాన్ని మేం ‘క్లౌడ్(స్టోరేజీ)’లోకి మారుస్తున్నాం’’అని అన్నారు.ఈ సందేశం యవత్ ప్రపంచానికి అలాగే ఐక్యరాజ్యసమితి(UN)కి సందేశం పంపారు. పసిఫిక్ ద్వీప దేశం ఎలా ఉందో తెలుపారు. ప్రపంచ దేశాలపై తువాలు దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని..గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించగలిగితే తువాలు సురక్షితంగా ఉంటుందని అప్పుడు ఆయన కోరారు.. మరి తువాలు దేశం మనుగడ సాగిస్తుందా? ఇటువంటి స్థితిలో ఉన్న దేశాల కోసం ఇప్పటికైనా ఈ ప్రపంచం మేలుకుంటుందా? తగిన చర్యలు తీసుకుంటుందా? లేదంటే మానవ మనుగడ కనుమరుగు కాకతప్పదంటున్నారు పర్యావరణవేత్తలు.