Viral News:15 నిముషాల తేడాతో ఏడాది దాటేసిన కవలలు

ప్రసవానికి ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణీ తన కవలల్లో ఒకరిని 2021లోనూ.. మరొకరిని 2022లోనూ ప్రసవించింది

Viral News: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రసవానికి ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణీ తన కవలల్లో ఒకరిని 2021లోనూ.. మరొకరిని 2022లోనూ ప్రసవించింది. 15 నిముషాల తేడాలో కవలలు వేర్వేరు సంవత్సరాల్లో జన్మించడం ఆ కుటుంబంతో పాటు ఆసుపత్రిలోనూ ఆనందాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే… కాలిఫోర్నియా రాష్ట్రం సలినాస్ ప్రాంతంలో నివసిస్తున్న మాడ్రిగల్ అనే నిండు గర్భిణీ.. ప్రసవం కోసం స్థానిక నాటివిడాడ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రికి వచ్చింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి పురిటినొప్పులతో బాధపడుతున్న మాడ్రిగల్ కు వైద్యులు డెలివరీ చేశారు. ఈక్రమంలో ముందుగా మగబిడ్డకు జన్మనిచ్చిన మాడ్రిగల్, 15 నిముషాల అనంతరం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వీరిలో మగబిడ్డ 2021 డిసెంబర్ 31న 11:45కి జన్మించగా.. ఆడబిడ్డ 2022 జనవరి 1న 00:2 నిముషాలకు జన్మించింది.

Also Read: Corona: ఫ్రాన్స్ లో బయటపడ్డ మరో కొత్త వేరియంట్

అత్యంత అరుదుగా జరిగిన ఈ సంఘటనపై ఆసుపత్రి వర్గాలు సంతోషం వ్యక్తం చేసాయి. మాడ్రిగల్ తమ ఆసుపత్రిలో తన ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మాడ్రిగల్ దంపతులకు గతంలో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరు చిన్నారులు రావడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిసాయి. ఈఘటన తాలూకు సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. సూపర్ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు వావ్.. స్పెషల్ ట్విన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: Zero Survey : తెలంగాణలో నేటి నుంచి సీరో సర్వే

ట్రెండింగ్ వార్తలు