Twitter: పాకిస్తాన్ నుంచి ట్వీట్ చేస్తే, జమ్మూ కశ్మీర్ అని చూపిస్తోందట.. వివాదాస్పదంగా ట్విటర్ తీరు

నేను #గిల్గిట్‌బాల్టిస్తాన్‌లో ఉన్నాను. @Twitter @GovtofPakistan నుంచి ట్వీట్‌లను చూపించలేను. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఖాతా నిలిపివేయబడిందని నోటిఫికేషన్ వస్తోంది! హలో @TwitterSupport, నేను పాకిస్తాన్‌లో ఉన్నాను

Twitter: పాకిస్తాన్ నుంచి ట్వీట్ చేస్తే, జమ్మూ కశ్మీర్ అని చూపిస్తోందట.. వివాదాస్పదంగా ట్విటర్ తీరు

Gilgit Baltistan Twitter: పాకిస్తాన్ దేశంలో ట్విటర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆ దేశంలోని ట్విటర్ ఖాతాల లొకేషన్ జమ్మూ కశ్మీర్ చూపిస్తోందట. గిల్గిత్-బాల్టిస్తాన్‌లోని పాకిస్తాన్ అధికారిక ట్విటర్ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. అయితే ఆ ట్విటర్ ఖాతా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని ఒక ప్రాంతాన్ని చూపిస్తున్నట్లు పాకిస్తాన్ లీడింగ్ పత్రి డాన్ పేర్కొంది. వినియోగదారులు యాప్‌లో లొకేషన్ ఫీచర్‌ను మార్చిన తర్వాత చేసిన ట్వీట్ల లొకేషన్ కూడా జమ్మూ కాశ్మీర్ అనే చూపిస్తున్నట్లు గుర్తించారు.

Italian Former PM Berlusconi: 33 ఏళ్ల ప్రియురాలికి రూ. 906 కోట్లు రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని

కొంత మంది తమ ట్విటర్ లొకేషన్‌ మార్పులను స్పష్టంగా చూపించి ట్వీట్ చేశారు. అయినప్పటికీ ఇలాగే జరుగుతోంది. ఇక గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఉన్నవారికి పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఖాతాకు యాక్సెస్‌ను బ్లాక్ చేసారు. ఈ ప్రాంతంలో ఉన్న పలువురు ట్విటర్ వినియోగదారులు ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వ అధికారిక ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నారని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

jupally krishna rao : భట్టి విక్రమార్కతో జూపల్లి భేటీ.. పతనం అంచుకు బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యలు

వినియోగదారులు ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు “చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఖాతా నిలిపివేయబడింది” అనే నోటిఫికేషన్ మెసేజ్ కనిపిస్తోందట. అయితే డాన్ పత్రికలో వచ్చిన ఈ కథనాన్ని పాకిస్తాన్ అధికారులు కొట్టిపారేశారు. డజన్ల కొద్దీ వచ్చిన నివేదికలను తప్పుడువని అంటున్నారు. గిల్గిత్ బాల్టిస్థాన్‌లో ఇంటర్నెట్, మీడియా, భావప్రకటనా స్వేచ్ఛపై ఎలాంటి ఆంక్షలు లేవని వారు పేర్కొన్నారు.

Women Commission Notices To Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు,10 రోజుల్లో లెక్కలతో సహా వివరణ ఇవ్వాలని ఆదేశం

దీనిపై గిల్గిట్‭లోని రహీమాబాద్ ప్రాంతంలో నివసించే యాసిర్ హుస్సేన్ అనే ఒక ట్విటర్ యూజర్ స్పందిస్తూ “నేను #గిల్గిట్‌బాల్టిస్తాన్‌లో ఉన్నాను. @Twitter @GovtofPakistan నుంచి ట్వీట్‌లను చూపించలేను. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఖాతా నిలిపివేయబడిందని నోటిఫికేషన్ వస్తోంది! హలో @TwitterSupport, నేను పాకిస్తాన్‌లో ఉన్నాను. నేను వీరి నుంచి ట్వీట్‌లను ఎందుకు చూడలేను? నేను పేర్కొన్న ఖాతాతో సహా వివిధ ఖాతాలను అనుసరిస్తున్నానా?” ట్వీట్ చేశాడు.

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. వరదలు, పిడుగులకు యూపీలో 34 మంది మృతి

డాన్‌తో హుస్సేన్ మాట్లాడుతూ.. తన ట్వీట్‌లకు లొకేషన్‌ను యాడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, యాప్ తనను గిల్గిత్ బాల్టిస్తాన్‌లో కాకుండా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉందని చూపిస్తోందని చెప్పాడు. జీబీ యొక్క జియోట్యాగింగ్‌ను మార్చడానికి భారతదేశం ట్విట్టర్‌ని ప్రభావితం చేసి ఉండవచ్చని, కాబట్టి పాకిస్తాన్‌లోని అధికారులు ఈ విషయంపై అవగాహన పెంచుకొని తీవ్రంగా తీసుకోవాలని అతడు అన్నాడు. ఇలా చాలా మంది ట్విటర్ యూజర్లు అభిప్రాయపడ్డారు.

Manipur Violence: హింసను పెంచడానికి కోర్టును ఉపయోగించుకోకూడదు.. మణిపూర్ అల్లర్లపై సుప్రీం

అయితే ఈ వార్తలపై గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఇలాంటి క్లెయిమ్‌లు చేసే వారు తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం మానేయాలని పేర్కొంది. ‘‘గిల్గిత్ బాల్టిస్తాన్‌లోని వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గిల్గిట్-బాల్టిస్తాన్ స్థితిని అగౌరవపరిచింది. ఇది ప్రాంతం యొక్క గుర్తింపుపై దాడి’’ అని ప్రభుత్వం పేర్కొన్నట్లు డాన్ నివేదించింది.