Benin Fire : బెనిన్ ఇంధన డిపోలో పేలుడు…34 మంది మృతి
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్‌లో జరిగిన పేలుడులో 34 మంది మరణించారు. నిషిద్ధ ఇంధన డిపో పేలడంతో ఆకాశంలోకి నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.....

Benin Fire
Benin Fire : నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్‌లో జరిగిన పేలుడులో 34 మంది మరణించారు. నిషిద్ధ ఇంధన డిపో పేలడంతో ఆకాశంలోకి నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి. దక్షిణ బెనిన్ పట్టణంలోని సెమె పోడ్జిలో అక్రమంగా ఉంచిన ఇంధనం గోదాములో పేలుడు వల్ల మంటలు చెలరేగాయి. (Two Babies Among 34 Killed By Fire) నైజీరియా ప్రధాన చమురు ఉత్పత్తిదారు. దేశంలో దీని సరిహద్దుల వెంబడి ఇంధన అక్రమ రవాణా సాగుతోంది.
Joe Biden : యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్‌కు కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్
‘‘ఈ పేలుడుతో నేను షాక్ అయ్యాను, ప్రజలు సహాయం కోసం కేకలు వేశారు. మంటల తీవ్రత పెరగడంతో వారిని కాపాడలేక పోయాం’’ అని స్థానిక కార్పెంటర్ ఇన్నోసెంట్ సిడోక్పోహౌ చెప్పారు. బెనిన్ పట్టణంలో తీవ్రమైన అగ్నిప్రమాదం సంభవించిందని బెనిన్ అంతర్గత మంత్రి అలస్సేన్ సీడౌ విలేకరులకు చెప్పారు. (Fire In Shop In Benin) ఇద్దరు శిశువులతో సహా 34 మంది మరణించారని, వారి శరీరాలు కాలిపోయాయని బెనిన్ అధికారులు చెప్పారు.
World Bank : సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరిక
ఈ అగ్నిప్రమాదంలో మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మంత్రి తెలిపారు. దశాబ్దాలుగా నైజీరియా నుంచి తక్కువ ధర సబ్సిడీ గ్యాసోలిన్ అక్రమంగా పొరుగు దేశాలకు బెనిన్‌కు రోడ్డు మార్గంలో రవాణా చేస్తున్నారు.