వెయ్యి మందిపై ఇండియన్ కరోనా వ్యాక్సిన్ల ప్రయోగం

వెయ్యి మందిపై ఇండియన్ కరోనా వ్యాక్సిన్ల ప్రయోగం

Updated On : July 15, 2020 / 3:00 PM IST

ఇండియన్లు తయారుచేసిన రెండు కరోనా వ్యాక్సిన్లకు మనుషులపై ప్రయోగించడానికి అనుమతి దొరికేసింది. ఒక్కొక్కదాన్ని 1000మందిపై ప్రయోగించి పరీక్ష చేయనున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మంగళవారం వెల్లడించింది. కొవిడ్-19 పరిస్థితిపై హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాట్లాడింది. ఐసీఎమ్మార్ డీజీ బలరాం భార్గవ ఇండియా నుంచి 60శాతం వ్యాక్సిన్ సప్లై చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ సప్లై చేసేందుకు ఇండియా కీలకంగా వ్యవహరిస్తోంది. COVID-19 వ్యాక్సిన్ తయారీ కోసం మనం వేగవంతంగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. ప్రపంచంలో COVID-19 వ్యాక్సిన్ ఎవరైనా తయారుచేసినా.. డెవలప్ చేసినా.. ఇండియా, చైనాల కంటే గొప్పవాళ్లే. వ్యాక్సిన్ డెవలప్ చేసే దానిలో భాగంగా ప్రపంచదేశాలన్నీ ఇండియాతో కమ్యూనికేట్ అవుతున్నాయి.

రెండు ఇండియన్ వ్యాక్సిన్ ఎలుకలు, ఎలుక పిల్లలు, కుందేళ్లపై ప్రయోగించారు.
వ్యాక్సిన్ గురించి.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాతో విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. నెలా మొదట్లో హ్యూమన్ ట్రయల్స్ మొదలుపెడుతున్నాం. దాదాపు 1000మంది ఈ ట్రయల్స్ లో పాల్గొననున్నారు. మిగిలిన వ్యాక్సిన్లపై కూడా పూణెలో పరీక్షలు నడుస్తున్నాయి. COVID-19 వ్యాక్సిన్ గురించి వేగవంతంగా పనిచేయడమనేది సామాజిక బాధ్యత అని భార్గవ అంటున్నారు.

రష్యా, చైనాలు కూడా ఈ ప్రోసెస్ ను స్పీడ్ చేశాయి. అమెరికా, ఇంగ్లాండ్ లు వెనుకడుగేసేదే లేదంటున్నాయి. ఇండియా కూడా అదే తరహాలో వ్యాక్సిన్ తయారుచేయడానికి పోరాడుతూనే ఉంది. ప్రతీ దేశం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ మహమ్మారి నుంచి బయటపడగలం. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా వ్యాక్సిన్ తయారీలోనే గడిపేస్తున్నాం. దాంతో పాటు సైంటిఫిక్, క్వాలిటీ, ఎథిక్స్ వంటి అంశాల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండానే సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు.