Mp With The Kid Who Came To Parliament In Uk Parliament
MP with the kid who came to Parliament in UK Parliament : ఎన్నో రంగాల్లో రాణిస్తున్న మహిళలు రాజకీయాల్లో కూడా తమదైన శైలిలో కొనసాగుతున్నారు. ఓ పక్క ఇంటి బాధ్యతలు..మరోపక్క రాజకీయాల్లో తమ పాత్రను చక్కగా నిర్వహిస్తున్నారు. చంటిబిడ్డలున్నా తమ బాధ్యతల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అన్ని విధాలుగా సమన్వయం చేసుకుంటు రాణిస్తున్నారు. అటువంటి ఓ మహిళా ఎంపీ తనకు ఓ చంటిపాప ఉన్నా పార్లమెంట్ సమావేశాలు హాజరయ్యారామె. తన కూడా తన చంటిబిడ్డను కూడా తీసుకువచ్చారు. దీంతో అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా చంటిబిడ్డలని చంకనేసుకుని పార్లమెంట్ కు వస్తారా?అంటూ ప్రశ్నించారు. మీరు చంటిపిల్లతో సమావేశాలకు హాజరుకావడం ఇకపై కుదరదు అని ఒకింత హెచ్చరించారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనతో ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో చంటిబిడ్డలున్న తల్లులు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకూడదన్న నిబంధనను యూకే పార్లమెంట్ పునః సమీక్షించాలని నిర్ణయించుకుంది. ఈ నిబంధనను సడలించే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంట్ అధికారులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేయటంతో ఈ పున:సమీక్షి జరుగనున్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళ ఓ మార్పుకు నాంది పలికినట్లైంది. లేబర్ పార్టీకి చెందిన స్టెల్లా క్రేజీ అనే ఎంపీ తన చంటిబిడ్డతో సహా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అది గమనించిన పార్లమెంట్ సిబ్బంది..‘ఇలా సమావేశాలకు హాజరుకావడం పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధమని.. మీరు చంటిపిల్లతో సమావేశాలకు హాజరుకావడం ఇకపై కుదరదు’ అంటూ హెచ్చరించారు. దీంతో ఆమె ఆవేదన చెందారు.ఆ ఆవేదన కాస్తా ఆగ్రహంగా మారింది. ఆమె ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహంతో కూడిన ఆవేదనను వ్యక్తం చేశారు స్టెల్లా క్రేజీ.
Read more : జోలాలీ: పార్లమెంటులో ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్
ఓ ఎంపీని..పైగా ఓ చంటిబిడ్డ తల్లిపై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేయటం..హెచ్చరించటంపై తోటి ఎంపీలు కూడా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఓ ఎంపీ ఇలా ఓ చంటిబిడ్డతో హాజరయ్యారు. జోన్స్‌విన్సన్ అనే ఎంపీ 2018 లో తన చంటిబిడ్డతో హాజరయ్యారని, దీనిని అధికారులు ఎలా మరిచిపోయారని కొందరు ఎంపీలు పార్లమెంట్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more : PM Jecinda Shock : ప్రధాని ప్రెస్‌మీట్‌లో రొమాన్స్ ప్రశ్న..షాకింగ్ రియాక్షన్ వైరల్
దీనిపై స్పీకర్ సర్ లిండ్సే కూడా స్పందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతు..‘తల్లిపాత్రలో ఉన్న ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని..చట్టాలు చేయడంలో వారి పాత్ర ఉంటుందని..ఉండితీరాలని..దానికి తగ్గ నియమ నిబంధనలు, ప్రస్తుత కాలానికి తగినట్లుగా లేవు కాబట్టి ఆ నిబంధనలు చేయాలని అధికారులను కోరారు. పార్లమెంట్ ఆవరణలో నర్సరీ కూడా ఉంది.దీనిని గమనంలోకి తీసుకుంటూ, నియమ నిబంధనలను రూపొందించాలని స్పీకర్ ఆదేశించారు.అలాగే పార్లమెంట్ సభ్యురాలికి వచ్చిన ఇబ్బంది గురించి మాత్రమే కాదు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత కూడా నాపై ఉందనీ..దానికి తగిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందని సర్ లిండ్సే అన్నారు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం మరొకటి ఏమిటంటే..ఈ విషయంపై బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ కూడా స్పందించటం. కొత్తగా ఎంపికైన సభ్యుల్లో తల్లిదండ్రుల పాత్రలో ఉన్నవారు కూడా సభకు ఎన్నికయ్యారని..వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని అన్నారు.