Health Minister Javid Tests Positive : బ్రిటన్ ఆరోగ్యమంత్రికి కరోనా…ఐసోలేషన్ లోకి వెళ్లేందుకు ప్రధాని నిరాకరణ

బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్‌కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన రెండు డోసులు వ్యాక్సిన్ వేయించు కున్నారు. అయినా ఆయనకు కరోనా పాజిటివ్ రావటం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.

Health Minister Javid Tests Positive : బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్‌కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన రెండు డోసులు వ్యాక్సిన్ వేయించు కున్నారు. అయినా ఆయనకు కరోనా పాజిటివ్ రావటం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.

తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సాజిద్ సూచించారు.  అయితే శుక్రవారం మంత్రి సాజిద్​ జావిద్​ తో సమావేశమయ్యారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఈ క్రమంలో టెస్ట్​ అండ్​ ట్రేస్​ ఫోన్​ యాప్​ ద్వారా ప్రధానిని అలర్ట్​ చేసినట్లు 10 డౌనింగ్​ స్ట్రీట్​ కార్యాలయం తెలిపింది. మొబైల్​ యాప్​ ద్వారా అలర్ట్​ చేసిన వ్యక్తులు 10 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. అయితే బోరిస్​ జాన్సన్​ మాత్రం స్వీయ నిర్బంధంలోకి వెళ్లేందుకు నిరాకరించారు.

బోరిస్ జాన్సన్ ఐసోలేషన్​కు వెళ్లకుండా.. ప్రత్యేక పని ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న ప్రత్యామ్నాయ విధానంలో ప్రతి రోజూ కరోనా టెస్ట్ చేసుకుంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆర్థిక మంత్రి రిషి సునక్​ కు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఆయన కూడా జావిద్ ​తో సమావేశమయ్యారు. వారిద్దరూ తప్పనిసరి కార్యకలాపాల్లోనే పాల్గొంటారని ప్రభుత్వం తెలిపింది.

అయితే ప్రత్యేక వీఐపీ రూల్​ తో ప్రధాని,ఆర్థికమంత్రి.. ఐసోలేషన్​కు వెళ్లకపోవటంపై చాలా మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రతిపక్ష లేబర్​ పార్టీ నేత జొనాతన్​ అశ్వర్థ్​ తెలిపారు. కాగా,గతేడాది ఏప్రిల్ లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

ఆర్టీపీసీఆర్ నివేదిక వచ్చిన తర్వాత విధులకు హాజరవ్వాలి. మొన్నటి వరకు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న మ్యాట్ హ్యాన్ కాక్ రాజీనామా చేయటంతో జూన్ 26న ఆరోగ్యశాఖమంత్రిగా సాజిద్ బాధ్యతలు చేపట్టారు.

కాగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి కూడా మనదేశంలో కరోనా సోకిన దాఖలాలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకే అవకాశాలు  ఉన్నాయని ఇప్పటికే   వైద్యులు వెల్లడించారు. కాకపోతే వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా ప్రాణాపాయం ఏర్పడే పరిస్ధితిలేదని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి.

ఇక కోవిడ్ ఆంక్షలు సడలించాలి అనుకునే సమాయానికి బ్రిటన్ లో  తిరిగి కరోనా కేసులు పెరగనారంభించాయి. ఈ ఏడాది జనవరి తర్వాత రోజువారీ కేసులు తొలిసారి 50 వేలు దాటాయి. రాబోయే రోజుల్లో ఈ కేసుల సంఖ్య  మరింత రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి జావేద్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు