King charles..Golden Chariot : బ్రిటన్ రాజు పట్టాభిషేకం.. 260 ఏళ్ల నాటి బంగారు రథంపై వేడుక..4 టన్నుల స్వర్ణరథం ప్రత్యేకతలు
బ్రిటన్ రాజు పట్టాభిషేకం జరుగనుంది. ఈ పట్టాభిషేకానికి కింగ్ చార్లెట్ 260 ఏళ్ల నాటి బంగారు రథంపై వెళ్లనున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ 4 టన్నుల బంగారు స్వర్ణరథం ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. రాయల్ ఫ్యామిలీ దర్పానికే కాదు వారి చరిత్రకు తార్కాణంగా నిలుస్తోందీ స్వర్ణరథం..

UK King charles..Golden Chariot (1)
UK King charles..Golden Chariot : బ్రిటన్ రాణి.. తల్లి క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తరువాత చెర్లెస్ రాజు అయ్యారు. చెర్లెస్ రాజు అయితే అయ్యారు గానీ ఆయన పట్టాభిషేకం మాత్రం వచ్చే ఏడాది అంటే 2023లో అంగరంగ వైభోగంగా జరుగనుంది. తన పట్టాభిషేకానికి కింగ్ చార్లెస్ 4 టన్నుల బరువుండే బంగారు రథంపై ఊరేగుతూ వెళ్లనున్నారు. ఈ బంగారు రథానికి ఉండే ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.
ఈ బంగారు రథాన్ని 1762లో బ్రిటిష్ రాజులు, రాణుల ప్రయాణాల కోసం ప్రత్యేకించి తయారు చేశారు. ఈ రాయల్ రైడ్ పట్టాభిషేకాలు, వార్షికోత్సవాలు, ఈవెంట్‌ల కోసం ఈ బంగారు రథం ఉపయోగించేవారు. ఇప్పుడు కింగ్ చార్లెస్ కూడా ఇదే రథంపై పట్టాభిషేకానికి వెళ్లనున్నారు.
జూన్ 2023లో చార్లెస్ పట్టాభిషేకం జరుగుతుందని సమాచారం. ఈ కార్యక్రమానికి కింగ్ చార్లెస్ స్వర్ణరథంపై వెళ్లనున్నారు. 1762 నాటి గోల్డ్ స్టేట్ కోచ్ ఇప్పటి వరకు అన్ని పట్టాభిషేకాల్లో ఉపయోగించబడింది.
ఈ బంగారు రథాన్ని 1762లో బ్రిటిష్ రాజులు, రాణుల ప్రయాణాల కోసం తయారు చేశారు. ఈ రాయల్ రైడ్ పట్టాభిషేకాలు, వార్షికోత్సవాలు, ఈవెంట్‌ల కోసం ఉపయోగించబడింది. దీనిని విలియం ఛాంబర్స్ రూపొందించారు. శామ్యూల్ బట్లర్ నిర్మించారు.
1821లో జార్జ్ IV పట్టాభిషేకం జరిగినప్పటి నుండి ప్రతి పట్టాభిషేకంలో ఇది ఉపయోగించారు. ఈ రథం పొడవు ఏడు మీటర్లు, ఎత్తు 3.6 మీటర్లు. దాని బరువు 4 టన్నులు. ఇంత బరువున్న ఈ స్వర్ణ రథాన్ని లాగడానికి 8 గుర్రాలు అవసరం అవుతాయి.
ఈ స్వర్ణ రథం వందల ఏళ్లనాటిదైనా బంగారం బంగారమే కదా..అందుకే దాని మేలిమి మెరుపు ఏమాత్రం తగ్గలేదు. 4టన్నుల బరువు ఉంటుంది కాబట్టి ఈ రథం ఏదో రాజుల రథాల్లా స్పీడ్ గా వెళ్లకుండా కేవలం నడక వేగంతో మాత్రమే ఉంటుంది. రథానికి అవసరమైన చెక్కను గిల్ట్‌వుడ్‌తో తయారు చేశారు. చెక్క భాగం కనిపించకుండా ఒక సన్నని బంగారు పొరతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. లోపల వెల్వెట్‌తో తయారు చేయబడింది.
ఈ స్వర్ణ రథానికి డిజైన్లుగా రోమన్ దేవుళ్ల, దేవతల అద్భుతమైన చిత్రాలు తయారు చేయబడ్డాయి. క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం 1953లో ఈ బంగారు రథంపైనే జరిగింది.
రాణి ప్లాటినం జూబ్లీ సందర్భంగా కూడా ఈ రథాన్ని ప్రదర్శించారు. అందులో ఎలిజబెత్ II హోలోగ్రామ్ ఉంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆ బంగారు రథం బయటకు రానుంది. అదే కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం.