Researcher in cave : జనసంచారం లేని గుహలో ఒకే ఒక్కడి కోసం..రంగంలోకి 240 మంది
గుహల గురించి పరిశోధనలు చేసే ఓ వ్యక్తి ప్రమాదకరమైన గుహలో చిక్కుకుపోయాడు. అతనికి కోసం 240మంది రంగంలోకి దిగారు. ఎముకలు విరిగిపోయి అత్యంత దారుణ స్థితిలో..

Man Gets Stuck In Brecon Beacons Cave
Man gets stuck in Brecon Beacons cave : నడుచుకుంటు నడుచుకుంటు అడవిలోకి వెళ్లిపోయినట్లుగా ఓ వ్యక్తి ..గుహ గురించి పరిశోధనలు చేస్తు ఓ వ్యక్తి గుహ లోపలికి వెళ్లిపోయాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకేముంది దారి తప్పిపోయాడు. చిక్కటి చీకటి. మనిషి జాడే కాదు పురుగుల జాడ కూడా లేని గుహ. బయటకు రాలేక సతమతమైపోయాడు. ఫోన్ సిగ్నల్ కూడా అందవు. అటువంటి గుహలో రెండు రోజుల పాటు ఉండిపోయాడు.గాలి, వెలుతురు లేని ప్రదేశంలో అలా పడి ఉంటే ఎవ్వరికైన పై ప్రాణాలు పైకి పోతాయి. కానీ చిక్కుకున్నాక భయపడినా తప్పదు. ఆ భయంలోనే గడపాలి. కానీ అతనిని రక్షించటానికి ఏకంగా 240మంది రంగంలోకి దిగారు.
అది బ్రిటన్. అక్టోబర్ 6. ఒక వ్యక్తి బ్రెకాన్ బీకాన్స్‌లోని గుహ వ్యవస్థల గురించి అధ్యయనం చేసే పరిశోధకుడు గుహని ఆసక్తిగా పరికించి చూస్తూ చూస్తూ అలా లోపలికి వెళ్లిపోయాడు. అలా 50 అడుగుల లోతులో పడిపోయాడు. దీంతో అతని ఎముకలు చాలా వరకు విరిగిపోయాయి. అతను వెళ్లిన చోటు..రావాల్సిన సమయం గురించి తెలిసిన ఓ వ్యక్తి అందించిన సమాచారంతో అతన్ని రక్షించడానికి 240 మంది రంగంలోకి దిగారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Read more : World Oldest Cake : 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు..ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే..!!
రక్షించటానికి వెళ్లిన వారిలో యూకేకి చెందిన ఎనిమిది కేవ్ రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. అలా అతని కోసం గాలించి గాలించి 54 గంటల తర్వాత అతడిని సురక్షితంగా గుహనుంచి బయటకు తీసుకొచ్చారు. ఇది వెల్ష్ కేవింగ్ చరిత్రలో సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిలిచింది. ఆ తర్వాత బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.అతనికి దవడ ఎముక విరిగిపోయింది.వెన్నెముకకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.