Zelensky: అయ్యో ఇలా జరిగిందేంటి.. తలపట్టుకున్న యుక్రెయిన్ రాయబారి.. వీడియో వైరల్.. జెలెన్ స్కీ ఏమన్నాడంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య మీడియా ఎదుటే మాటల యుద్ధం చోటు చేసుకుంది.

Zelensky: అయ్యో ఇలా జరిగిందేంటి.. తలపట్టుకున్న యుక్రెయిన్ రాయబారి.. వీడియో వైరల్.. జెలెన్ స్కీ ఏమన్నాడంటే?

Oksana Markarova

Updated On : March 1, 2025 / 8:59 AM IST

Trump-Zelensky: రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా యుక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. అయితే, వీరి మధ్య భేటీ కాస్త ఇరువురి నేతల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. మీడియా ఎదుటే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

Also Read: Trump Zelensky Argument : మీ వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది..! మీడియా ముందే ట్రంప్, జెలెన్ స్కీ తీవ్ర వాగ్వాదం..

భవిష్యత్తు లో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ పేర్కొన్నాడు. దీంతో ట్రంప్ స్పందిస్తూ.. యుక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు. జెలెన్ స్కీ సైతం అదే స్థాయిలో బదులివ్వడంతో ఇరువురి నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం తరువాత జెలెన్ స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 

భేటీ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ఓ పోస్టు పెట్టారు. రష్యాలో శాంతి ఒప్పందానికి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సుముఖంగా లేరని అర్ధమైందంటూ రాసుకొచ్చాడు. మరోవైపు ట్రంప్ తో భేటీ కొద్దిసేపటికే జెలెన్స్కీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘‘ధన్యవాదాలు అమెరికా, మీ మద్దతుకు ధన్యవాదాలు, డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ మరియు అమెరికన్ ప్రజలకు ధన్యవాదాలు. ఉక్రెయిన్‌కు న్యాయమైన, శాశ్వత శాంతి అవసరం. మేము దాని కోసమే కృషి చేస్తున్నాము” అని జెలెన్స్కీ పేర్కొన్నాడు.


ట్రంప్ తో వాగ్వివాదం అనంతరం జెలెన్ స్కీ ఓ మీడియా తో మాట్లాడాడు. వైట్ హౌస్ లో జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదు.. తాను అమెరికా అధ్యక్షుడిని, అమెరికా ప్రజలను గౌరవించానని జెలెన్ స్కీ సమాధానం ఇచ్చాడు.

ఇదిలాఉంటే.. ట్రంప్ -జెలెన్స్కీ మధ్య ఘర్షణ తీవ్రమవుతుండగా.. యుక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా తల ఊపుతూ.. తల పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.