Trump Zelensky Argument : మీ వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది..! మీడియా ముందే ట్రంప్, జెలెన్ స్కీ తీవ్ర వాగ్వాదం..

రష్యా-యుక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో జెలెన్ స్కీ వ్యవహారశైలి కరెక్ట్ కాదన్నారు ట్రంప్.

Trump Zelensky Argument : మీ వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది..! మీడియా ముందే ట్రంప్, జెలెన్ స్కీ తీవ్ర వాగ్వాదం..

Updated On : March 1, 2025 / 1:48 AM IST

Trump Zelensky Argument : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా ముందే వీరిద్దరూ వాదించుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్ స్కీ.. ట్రంప్ తో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరువురూ కలిసి ఓవల్ ఆఫీస్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జెలెన్ స్కీ యుద్ధకాంక్షతో ఉన్నారంటూ ట్రంప్ అన్నారు.

జెలెన్ స్కీపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. ఒప్పందం చేసుకో లేదంటే మేము బయటకు వెళ్లిపోతాం అంటూ జెలెన్ స్కీకి ట్రంప్ తేల్చి చెప్పారు. మీరు చాలా పెద్ద సమస్యలో ఉన్నారు, మీరు గెలవలేరు అని జెలెన్ స్కీని ఉద్దేశించి ట్రంప్ అన్నారు.

యుద్ధకాంక్షతో ఉన్నారు అని ట్రంప్ అనడం పట్ల జెలెన్ స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తో ఆయన వాదనకు దిగారు. మా దేశంలో మేము ఉంటున్నామని బదులిచ్చారు. ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు జెలెన్ స్కీ.

రష్యా-యుక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో జెలెన్ స్కీ వ్యవహారశైలి కరెక్ట్ కాదన్నారు ట్రంప్. చాలా విషయాలను ఇది సమస్యగా మారుస్తుందని జెలెన్ స్కీపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ సమయంలో డిక్టేటర్ షిప్ చేయాలంటే కుదరదని చెప్పారు. సింపతీ కార్డ్స్ యూజ్ చేయొద్దని హితవు పలికారు ట్రంప్. లక్షల మంది జీవితాలో చెలగాటం ఆడుతున్నారు అంటూ జెలెన్ స్కీపై ట్రంప్ మండిపడ్డారు. మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది అంటూ సీరియస్ అయ్యారు.

Also Read : బంగారం ధరలు ఉన్నట్టుండి ఎందుకు తగ్గుతున్నాయి? విశ్లేషకులు ఏమంటున్నారు?

ట్రంప్ తో జెలెన్ స్కీ వాదనకు దిగడంతో.. అక్కడే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకున్నారు. గట్టిగా మాట్లాడొద్దు అంటూ జెలెన్ స్కీతో చెప్పారాయన. రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్ పడాలంటే దౌత్యం అవసరం అని స్పష్టం చేశారాయన. ఎలాంటి దౌత్యం అని జెలెన్ స్కీ ఎదురు ప్రశ్నించడంతో.. వాన్స్ ఒకింత అసహనానికి గురయ్యారు. మొత్తంగా అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలోనే జరిగిన ఈ మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.