Ukrainian : బ్రిటన్ ప్రధానికి షాక్ ఇచ్చిన మహిళా జర్నలిస్టు

యుక్రెయిన్‌ను నో ఫ్లైజోన్‌గా ప్రకటిస్తే ఏంటి సమస్య అని జర్నలిస్ట్ నిలదీయడంతో బోరిస్ జాన్సన్‌ నీళ్లు నమిలారు. అసలు ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదని...

Ukrainian : బ్రిటన్ ప్రధానికి షాక్ ఇచ్చిన మహిళా జర్నలిస్టు

Boris

Updated On : March 2, 2022 / 7:39 AM IST

Ukrainian Woman Boris Johnson : పోలెండ్‌లో పర్యటిస్తున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు యుక్రెయిన్ మహిళా జర్నలిస్ట్‌ షాక్ ఇచ్చింది. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఓ రేంజ్‌లో కడిగి పారేసింది. ఆ మహిళా జర్నలిస్టు దెబ్బకు జాన్సన్‌ నోరు వెళ్లబెట్టి చూడటం మినహా ఏమీ చేయలేకపోయారు. అసలు మమ్మల్ని నట్టేట ముంచింది మీరు కాదా అని నిలదీసింది యుక్రెయిన్ జర్నలిస్టు. యుక్రెనియన్ పిల్లలపై బాంబుల వర్షం కురుస్తుందన్నారు. కానీ మీరు మరిన్ని ఆంక్షల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మరి రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్‌పై ఆంక్షలేవన్నారు..? అతను లండన్‌లోనే ఉన్నాడని.. అతని పిల్లలు యుద్ధభూమిలో లేరన్నారు. పుతిన్‌ పిల్లలు నెదర్లాండ్‌, జర్మనీలో ఉన్నారన్నారు. విలాసవంతమైన భవనాల్లో జీవితాలు గడుపుతున్నారన్నారు. మీరు వాటిని ఎక్కడ సీజ్‌ చేశారని నిలదీశారు.

Read More : Russia warns France: ‘హద్దు దాటితే మీకూ మూడిందే’ ఫ్రాన్సును హెచ్చరించిన రష్యా మాజీ అధ్యక్షుడు

యుక్రెయిన్‌ను నో ఫ్లైజోన్‌గా ప్రకటిస్తే ఏంటి సమస్య అని జర్నలిస్ట్ నిలదీయడంతో బోరిస్ జాన్సన్‌ నీళ్లు నమిలారు. అసలు ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదని… ఓసారి దేశంలోకి వచ్చి చూస్తే పరిస్థితి మీకు అర్థమవుతుందని చెప్పింది. పోలెండ్‌కు వచ్చిన మీరు కీవ్‌కు ఎందుకు రాలేదంటూ జాన్సన్‌ను ఆమె నిలదీసింది. మరిన్ని ఆంక్షలు అంటున్న మీరు అసలు ఇప్పటిదాకా అమలు చేస్తున్న ఆంక్షలు ఏమైనా ఫలితాన్నిచ్చాయా అని ప్రశ్నించారు. రష్యా బిలియనీర్లు యూరోప్‌లోనే దర్జాగా గడుపుతున్నారని చెప్పారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు బోరిస్‌ జాన్సన్‌ అలా చూస్తుండిపోయారు.