వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం రెట్టింపు చేయండి : ఐక్యరాజ్యసమితి
COVID-19 వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని.. అభివృద్ధి చెందుతున్న దేశాలలకు వ్యాక్సిన్ల పంపిణీ ఈ సమయంలో చాలా ముఖ్యమని ఐక్యరాజ్యసమితి

Un Chief Calls For Doubling Of Worlds Covid Vaccine Production
Antonio Guterres: COVID-19 వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు.. అభివృద్ధి చెందుతున్న దేశాలలకు వ్యాక్సిన్ల పంపిణీ ఈ సమయంలో చాలా ముఖ్యమని.. ఈ దేశాలు కరోనావైరస్ యొక్క కొత్త తరంగాలను ఎదుర్కొంటున్నాయని గుటెర్రెస్ చెప్పారు.
చాలా దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయన్న గుటెర్రెస్.. ముఖ్యంగా భారతదేశంలో కరోనా రెండవ తరంగాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని అన్నారు.. కేసులు పెరిగిపోతుండడంతో ఆస్పత్రులలో బెడ్లు కొరతను ఎదుర్కొంటుందని.. కొన్ని కుటుంబాలు మందులు మరియు ఆక్సిజన్ కోసం పెనుగులాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో, కొన్ని ధనిక దేశాలు వైరస్ వలన అత్యంత ఎక్కువగా ప్రభావితమయ్యే పౌరులకు టీకాలు వేయకుండా.. యువతకు అందిస్తున్నాయని చెప్పారు, అలాగే అనేక దేశాలు తమ జనాభాకు ఒకటి కంటే ఎక్కువసార్లు టీకాలు వేశాయని ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.