నయా ట్రెండ్ బాస్: క్రిస్ గేల్ పేరుతో గోల్డ్ రింగులు

ఎవడికి వాడే బాస్. ఎవరి బ్రాండ్ వాళ్లదే. క్రిస్ గేల్ స్టైల్ ఇదే. తనకు తానుగా సొంతంగా స్టైల్‌ను బ్రాండ్ ప్రకటించేసుకున్నాడు. క్రికెట్ మైదానంలో.. బయటా బ్రాండ్ అంబాసిడర్‌లా చాలాసార్లే ప్రకటించుకున్న గేల్.. ఇప్పుడు ఉంగరాలపైనా తన బొమ్మతో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేశాడు.
బంగారంతో గేల్ బొమ్మ దాంతో పాటు సీజీ అనే అక్షరాలతో రింగు తయారు చేశారు. రింగు ఎడమ వైపున అతని అత్యధిక స్కోరు 333ను ముద్రించారు. గేల్ తన టెస్టు కెరీర్లో చేసిన హై స్కోరు అది. వీటన్నిటితో పాటు గేల్ సంతకం కూడా ఆ రింగ్‌పై ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న గేల్ టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కు కూడా హాజరయ్యాడు.
కామెంటరీ బాక్స్ లో దూరి కాసేపు కామెంటరీ కూడా చెప్పాడు. రాబోయే ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహించనున్న గేల్.. ఫుల్ జోష్ తో కనిపిస్తున్నాడు. గతేడాది జరిగిన వేలంలో ఈ జమైకా హీరోను కనీస ధర అయిన రూ.2కోట్లకే కొనుగోలు చేసింది.