Tornadoe : కెంటకీలో యుగాంతం సినిమా క్లైమాక్స్ దృశ్యాలు
కెంటకీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలిగించిన టోర్నడో ఇదే. టోర్నడో ధాటికి ఏకంగా మేఫీల్డ్ సిటీలోని క్యాండిల్ ఫ్యాక్టరీ పైకప్పు ఎగిరిపోయింది.

Up To 110 Feared Dead In Kentucky After Tornadoes
Kentucky Tornadoes : అమెరికా చరిత్రలో ఎప్పుడూ చూడని విధ్వంసం..ఎంతో మంది గల్లంతు…నేలకూలిన ఇళ్లు…పరిస్థితి భీతావహం..మరణించిన వారు కొందరు..ఎంతో మంది గాయపడిన వారు మరికొందరు..ఇళ్లు, సర్వస్వం కోల్పోయి..ఎంతో మంది రోడ్డున పడ్డారు. టోర్నడో ధాటికి అమెరికాలోని కెంటకీ విలవిల్లాడింది. టోర్నడో ధాటికి చనిపోయిన వారి సంఖ్య 110 దాటింది. మరికొంతమంది ఆచూకీ లభించడం లేదు. వారి కోసం గాలిస్తున్నారు. బలమైన గాలులకు ఇళ్లు నేలకూలాయి. దీంతో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు అధికారులు. ఇక మైఫీల్డ్ ఫ్యాక్టరీలో చిక్కుకున్న 40 మందిని సహాయక బృందాలు కాపాడాయి. చిక్కుకున్న మరికొంతమందని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Read More : Protein Powders : ప్రొటీన్ పౌడర్ల తయారీ ఇంట్లోనే…ఎలాగంటే?
ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భీతావహంగా మారింది. సెంట్రల్, సదరన్ అమెరికాలోని ఆర్కాన్సాస్, ఇల్లినాయిస్, కెంటకీ, మిస్సోరీ, టెన్నెసి రాష్ట్రాల్లో.. అకస్మాత్తుగా సంభవించిన భారీ టోర్నడోలు.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అమెజాన్‌కు చెందిన భారీ గోడౌన్‌ను.. టోర్నడో తుక్కుతుక్కు చేసింది. కెంటకీలో 320 కిలోమీటర్ల పొడవునా భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. టోర్నడోల ధాటికి కెంటకీలోనే దాదాపు 80 మంది దాకా చనిపోయారు.
Read More : Middle Finger to Woman: మహిళకు మధ్య వేలు చూపిస్తే 6నెలల జైలు శిక్ష
అటు కెంటకీ నగరంలో యుగాంతం సినిమా క్లైమాక్స్ దృశ్యాలు కనిపించాయి. కెంటకీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలిగించిన టోర్నడో ఇదే. టోర్నడో ధాటికి ఏకంగా మేఫీల్డ్ సిటీలోని క్యాండిల్ ఫ్యాక్టరీ పైకప్పు ఎగిరిపోయింది. శిథిలాలు మీద పడటంతో చాలా మంది చనిపోయారు. టోర్నడోల దెబ్బకు బాంబు పేలినట్లుగా అనిపించేలా సాగింది టోర్నడో విధ్వంసం. దాదాపు మూడు లక్షల మందికి విద్యుత్ లేకుండా పోయిందని సమాచారం. స్టేట్ మొత్తం అతలాకుతలం కావడంతో రాష్ట్రంలో ఏకంగా ఎమర్జెన్సీని ప్రకటించాల్సి రావడమంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నయో అర్థం చేసుకొవచ్చు.