సోహ్యాపీ : వ్యాక్సిన్ వేసుకున్న ఆనందంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యాన్సులు

US boston health workers danced to the joy of receive covid 19 vaccine : కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టారు డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది.కరోనా వారియర్స్ గా నిలబడ్డారు. కుటుంబాలను కూడా వదిలేసుకుని హాస్పిటల్స్ కే పరిమితమై కరోనా బాదితులకు వైద్యం చేశారు.వారిలో ఆత్మస్థైరాన్ని నింపారు.
ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు,వైద్య సిబ్బంది అహోరాత్రులు కరోనాతో యుద్ధం చేశారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసింది. దీంతో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది ఆనందంతో డ్యాన్సులు వేస్తున్నారు.
కానీ ఈనాటికి యూఎస్ రాష్ట్రాల్లో ఇంకా కరనో కేసులు పెరుగుతునే ఉన్నాయి. హెల్త్ వర్కర్లు నెలల తరబడి కష్టపడుతూనే ఉన్నారు. ఈక్రమంలో కరోనాకు వ్యాక్సిన్ రూపంలో ఇప్పుడిప్పుడే వారికి కాస్త ఊరట లభిస్తోంది. ఈక్రమంలో బోస్టన్ మహానగరంలోని ఓ హాస్పిటల్ లో కరోనాకు వ్యాక్సిన్ తీసుకున్న కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యాన్స్ లతో అదరగొట్టారు. అదిరేటి స్టెప్పులతో అలరించారు.
వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాక బోస్టన్ మెడికల్ సెంటర్(BMC)కి చెందిన హెల్త్ వర్కర్లు ఆనందంతో డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖాలకు ఫేస్ షీల్డ్ పెట్టుకొని అమెరికన్ సింగర్ లిజో హిట్ సాంగ్ ‘గుడ్ యాస్ వెల్’ అనే పాటకు చిందేశారు. ఈ వీడియోను బీఎంసీ సీఈవో కాటే వాల్ష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Why I love my job @The_BMC ! Teams of people working to safely and equitably distribute vaccines to their front line colleagues getting cheered on by their friends celebrating the arrival of the vaccines! A great day, a great place. ❤️ pic.twitter.com/XfrIthFIY5
— Kate Walsh (@KateWalshCEO) December 14, 2020