గెలుపు ఎవరిది.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ..

స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీ నెలకొన్నట్లు తాజా ఒపీనియన్ పోల్స్ పేర్కొంటున్నాయి.

గెలుపు ఎవరిది.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ..

US Elections 2024 (Photo Credit : Google)

Updated On : November 4, 2024 / 7:37 PM IST

US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఎవరు గెలుస్తారోనని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వార్ తుదిదశకు చేరింది. మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటాపోటీ ఉండగా.. అభ్యర్థుల తలరాతలు స్వింగ్ స్టేట్స్ డిసైడ్ చేయనున్నాయి. అమెరికాలో ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా పోలింగ్ కొనసాగుతోంది.

ఈ క్రమంలో స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీ నెలకొన్నట్లు తాజా ఒపీనియన్ పోల్స్ పేర్కొంటున్నాయి. ఈ స్వింగ్స్ స్టేట్స్ లో న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ తమ చివరి పోల్ సర్వేను ఆదివారం వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ పైన హారిస్.. స్వల్ప ఆధిక్యత కనబరుస్తున్నారు. నెవెడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ లలో హారిస్ స్వల్పంగా ముందంజలో ఉండగా.. ఆరిజోనాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మిచిగాన్, జార్జియా, పెన్సిల్వేనియాలో ఇరువురి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్లు తేలింది.

Also Read : అమెరికా ఎన్నికలు.. హాలీవుడ్ సెలెబ్రిటీలు, బిజినెస్ టైకూన్స్ ఎవరి వైపు?