Serial Record Breaker : సీరియల్ రికార్డ్ బ్రేకర్.. ఒకే రోజులో 15 గిన్నిస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు!

Serial Record Breaker : జీడబ్ల్యూఆర్ ప్రకారం.. మొదట గారడి విద్యతో రష్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 198తో ఒక నిమిషంలో మూడు ఆపిల్‌లను గాల్లోకి ఎగరేసి అత్యధిక సార్లు నోటితో కొరికాడు.

Serial Record Breaker : సీరియల్ రికార్డ్ బ్రేకర్.. ఒకే రోజులో 15 గిన్నిస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు!

US Man, Dubbed _Serial Record Breaker_, Sets 15 Guinness World Records In Single Day

Serial Record Breaker : అతడో సీరియల్ రికార్డ్ బ్రేకర్.. అమెరికాకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించాడు. సింగిల్ డేలో అత్యధిక సంఖ్యలో గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అమెరికాలోని ఇడాహోకు చెందిన రష్.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 గిన్నిస్ రికార్డులను ఒకే రోజులో నెలకొల్పాడు. ఇప్పటివరకు తన జీవితంలో 250కు పైగా ప్రపంచ రికార్డులను డేవిడ్ రష్ బద్దలు కొట్టాడు. లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన రష్.. ప్రస్తుతం 180 వద్ద ఉన్న టైటిల్స్ వేలం వేసేందుకు వెళ్ళాడు.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

ఒకే రోజులో అనేక రికార్డులను బ్రేక్ చేయడం డేవిడ్‌కు మాత్రమే సాధ్యమైంది అంటూ జీడబ్ల్యూఆర్ అధికారిక న్యాయనిర్ణేత విల్ సిండెన్ అన్నారు. జీడబ్ల్యూఆర్ ప్రకారం.. మొదట గారడి విద్యతో రష్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 198తో ఒక నిమిషంలో మూడు ఆపిల్‌లను గాల్లోకి ఎగరేసి అత్యధిక సార్లు నోటితో కొరికాడు. టేబుల్ టెన్నిస్ బంతిని రెండు బాటిల్ క్యాప్స్‌పై పదిసార్లు ప్రత్యామ్నాయ చేతులతో బౌన్స్ చేశాడు. కేవలం 2.09 సెకన్లలో ఈ ఫీట్‌ను సాధించాడు. 30 సెకన్లలో 125 భారీ బేస్ బాల్స్‌ను చేతితో అత్యధికంగా తాకిన రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

పింగ్ పాంగ్ బంతులను ఉపయోగించి రష్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో కేవలం 30 సెకన్లలో అత్యధిక టేబుల్ టెన్నిస్ బంతులను నోటితో గోడకు ఎగరేశాడు. ఒక నిమిషంలో టేబుల్ టెన్నిస్ బాల్‌ను గోడకు కొట్టిన అత్యధిక హిట్‌లు ఉన్నాయి. ఆ తర్వాత, మూడు బంతులతో ఒక నిమిషంలో బౌన్స్ చేస్తూ రికార్డును రష్ బద్దలు కొట్టాడు. రెండు బంతులను బ్యాలెన్స్ బోర్డ్‌లో ఒక నిమిషంలో పూర్తి చేశాడు. కేవలం 5.12 సెకన్లతో పేపర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మడతపెట్టి వేగంగా విసురుతూ తక్కువ సమయంలో పూర్తి చేశాడు.

ఒక నిమిషంలో 29 కన్నా ఎక్కువ చాప్‌స్టిక్‌లు విసిరిన టైటిల్‌ను కూడా పొందాడు. ఈ రికార్డులను రష్ కేవలం ఒక రోజులో పూర్తి చేశాడు. కేవలం 30 సెకన్లలో టీ-షర్టులను ధరించాడు. 10 టాయిలెట్ పేపర్ రోల్స్ (ఒక చేతి)తో పేర్చడం, సెకన్ల వ్యవధిలో స్ట్రా ద్వారా ఒక లీటరు నిమ్మరసం తాగడం వంటి ఎన్నో రికార్డు టైటిల్స్ బద్దలుకొట్టాడు. ఒక రోజులో 15 గిన్నిస్ రికార్డులను క్రియేట్ చేయడం నమ్మశక్యం కాదని సిండేన్ చెప్పారు.

Read Also : PhD Student : ఫోన్ లేకుండా 134 రోజులు చైనా మొత్తం చుట్టేశాడు.. నువ్వు గొప్పొడివి సామీ..!