Donald Trump : జోహ్రాన్ మమ్దానీ విజయంపై ట్రంప్ సంచలన కామెంట్స్.. రెండు కారణాల వల్లనే అలా జరిగిందంట..!

Donald Trump న్యూయార్క్‌లో మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ నేత జోహ్రాన్ మమ్దానీ విజయం పై ట్రంప్ స్పందించారు.

Donald Trump : జోహ్రాన్ మమ్దానీ విజయంపై ట్రంప్ సంచలన కామెంట్స్.. రెండు కారణాల వల్లనే అలా జరిగిందంట..!

Donald Trump

Updated On : November 5, 2025 / 12:47 PM IST

Donald Trump : అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ దక్కించుకున్నాడు.అదే సమయంలో వర్జీనియాలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన అబిగైల్ స్పాన్‌బెర్గర్ విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైల్ కావడం విశేషం. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటికన్లు విజయకేతనం ఎగురవేశారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై ప్రజా వ్యతిరేఖతకు ఈ ఎన్నికలు అర్ధం పట్టాయి. ఈ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో సంచలన కామెంట్స్ చేశారు.


న్యూయార్క్ లో మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ నేత జోహ్రాన్ మమ్దానీ విజయం పై ట్రంప్ స్పందించారు. ఓటమికి రెండు కారణాలు చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సోషల్ ట్రూత్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘బ్యాలెట్‌లో ట్రంప్ పేరు లేదు. మరోవైపు నెల రోజులుకుపైగా కొనసాగుతోన్న ఫెడరల్ షట్ డౌన్. ఈ రెండు కారణాల వల్ల రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా కాలిఫోర్నియాలో ఓటింగ్ ప్రక్రియలోనూ రిగ్గింగ్ జరిగింది.. మెయిల్ -ఇన్ ఓట్లను పక్కనబెట్టేశారు . ఇది చాలా తీవ్రమైన అంశం అని ట్రంప్ ఆరోపించారు.

Also Read: Zohran Mamdani : ఎవరీ జోహ్రాన్ మమ్దానీ..? భారత దేశంతో అతనికున్న సంబంధాలేంటి..? 34ఏళ్లకే న్యూయార్క్ మేయర్‌గా విజయం.. ట్రంప్‌కే షాకిచ్చాడు..

గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైంది. వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో, సిన్సినాటీ మేయర్, అట్లాంటా మేయర్, పిట్స్‌బర్గ్ మేయర్ ఎన్నికల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఓటమి తప్పలేదు. సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. అతనిపై డెమోక్రటిక్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ విజయం సాధించారు.