US-China : జిన్ పింగ్‌కు జో బైడెన్ వీడియో కాల్.. పదవిలోకి వచ్చాక ఫస్ట్ టైం

ఓల్డ్ ఫ్రెండ్ ను చాన్నాళ్ల తర్వాత చూడటం సంతోషంగా ఉంది. యూఎస్ నాయకుడితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం..........................

Biden Jin Ping

US-China : అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తి రేపిన పరిణామం ఇది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్… చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో వర్చువల్ వీడియో లింక్ ద్వారా మాట్లాడుకున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచిన తర్వాత.. చైనా అధ్యక్షుడితో నేరుగా వీడియో లింక్ ద్వారా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఐతే.. ఇప్పటికే రెండుసార్లు ఫోన్ లో మాట్లాడుకున్న ఈ ఇద్దరు.. తొలిసారి ఫేస్ టు ఫేస్ చర్చల్లో పాల్గొన్నారు.

మంగళవారం(నవంబర్ 16,2021) తెల్లవారుజామున ఈ మీటింగ్ జరిగిందని వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. తైవాన్ విషయంలో తలెత్తిన ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా ఈ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగినట్టు సమాచారం. ఏ రెండు దేశాల మధ్య అయినా శత్రుత్వం పెరిగినప్పుడు సంఘర్షణ వైఖరిని వదిలిపెట్టి శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని జో బైడెన్ ఈ సందర్భంగా జిన్ పింగ్ తో అన్నారు.

Read This : Xi Jinping : చైనా జీవితకాల అధినేతగా జిన్‌పింగ్‌..! చారిత్రక తీర్మానానికి కమ్యూనిస్టు పార్టీ ఆమోదం

“యూఎస్- చైనా మధ్య కానీ… ఈ రెండు దేశాలకు సంబంధించిన విషయంలోగానీ.. ఏదైనా సంఘర్షణాత్మక సందర్భం వచ్చినప్పుడు ఆ పరిస్థితిని చల్లార్చేలా… కాపలాదారులుగా ఉందాం” అని బైడెన్.. జిన్ పింగ్ తో చెప్పారు. రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలున్న దేశాలైన అమెరికా, చైనాలు.. దాపరికం లేకుండా.. కీలక అంశాలపై సూటిగా ఉంటే బాగుంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు.

సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా- చైనా దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జీ జిన్ పింగ్ అన్నారు. అమెరికా- చైనా దేశాల మధ్య మరింత కమ్యూనికేషన్, కో-ఆపరేషన్ అవసరం చెప్పారు.

“ఓల్డ్ ఫ్రెండ్ ను చాన్నాళ్ల తర్వాత చూడటం సంతోషంగా ఉంది. యూఎస్ నాయకుడితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం” అని జిన్ పింగ్ చెప్పారని వైట్ హౌజ్ తెలిపింది. ప్రపంచమనే గ్రామంలో మానవత్వం బతకాలని జిన్ పింగ్ ఆకాంక్షించారు. సవాళ్లు ఏవైనా దేశాలు కలిసి పరిష్కరించుకోవాలని బైడెన్ తో మీటింగ్ లో చెప్పారు జిన్ పింగ్.

Read This : తైవాన్_ను ట_చ్ చేస్తే తాట తీస్తాం.! _ Joe Biden Warning to China on Taiwan Issue