వాడు చచ్చాడు.. అంటూ సంబరాలు చేసుకున్న ప్రజలు

బాగ్దాద్‌ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 11:39 AM IST
వాడు చచ్చాడు.. అంటూ సంబరాలు చేసుకున్న ప్రజలు

Updated On : January 3, 2020 / 11:39 AM IST

బాగ్దాద్‌ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌

బాగ్దాద్‌ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలతో ఖాసిమ్ ను దళాలు మట్టుబెట్టాయి. ఖాసిమ్ మృతిని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ధ్రువీకరించింది. అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాలే దాడి చేశాయని తెలిపింది.

కమాండర్ ఖాసిమ్ హతమైన తర్వాత ఇరాక్ లో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అమెరికా దళాలకు థ్యాంక్స్ చెప్పారు. కమాండర్ ఖాసిమ్ చచ్చాడు.. అంటూ ప్రజలు నినాదాలు చేశారు. మాకు స్వేచ్చ కావాలి అని అరిచారు. ఈ వీడియోని అమెరికా స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియో ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

ఇరాక్ లో అమెరికన్ దౌత్యవేత్తలు, సేవా సభ్యులపై దాడి చేసే ప్రణాళికలను సొలైమని యాక్టివ్ గా డెవలప్ చేస్తున్నారని, వందలాది మంది అమెరికన్, సంకీర్ణ సేవా సభ్యుల మరణాలకు, వేలాది మంది గాయపడటానికి సొలైమని.. అతని ఖడ్స్ ఫోర్స్ కారణమని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. సొలైమనిపై అటాక్ తర్వాత.. కాసేపటికే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా జెండా చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

శుక్రవారం(జనవరి 3,2020) ఉదయం బాగ్దాద్ ఎయిర్ పోర్టు స‌మీపంలో కారులో వెళ్తున్న సొలైమ‌నిపై అమెరికా ద‌ళాలు వైమానిక దాడి చేశాయి. ఈ దాడిలో సొలైమ‌ని ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడి వెనకున్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ సుప్రీం నేత అయ‌తుల్లా అలీ ఖ‌మే హెచ్చరించాడు.

ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని నిఘా విభాగం ఖడ్స్‌ ఫోర్స్‌కి మేజర్‌ జనరల్‌ ఖాసిం సొలైమని 1998 నుంచి అధిపతిగా కొనసాగుతున్నారు. సరిహద్దు వెలుపల మధ్య ఆసియాలో జరిపే దాడులు ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చడం, ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌పై పోరులో ఖాసిం కీలక పాత్ర పోషించాడు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమనెయ్‌కి ఖాసిం నేరుగా రిపోర్ట్‌ చేస్తాడు.

1980 నాటి ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంతో వెలుగులోకి వచ్చిన ఖాసిం.. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన అధికారి అయ్యారు. రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక.. అమెరికా ఆంక్షలతో నాశనమైన ఇరాన్ ఆర్ధిక వ్యవస్థను తిరిగి పునురుద్దరించడంలో సహాయపడ్డాడు.