US Supreme Court: జాతి, రంగు ఆధారంగా రిజర్వేషన్లు నిషేధించిన అమెరికా సుప్రీంకోర్టు.. గుండె పగిలిందన్న ఒబామా

ఆఫ్రికన్-అమెరికన్లు సహా ఇతర మైనారిటీ వర్గాలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. 1960 వ సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ అడ్మిషన్లలో జాతి, తెగ లాంటి పదాలను రిజర్వేషన్ కేటగిరీ కింద ప్రధానంగా ఉపయోగిస్తున్నారు

US Supreme Court: జాతి, రంగు ఆధారంగా రిజర్వేషన్లు నిషేధించిన అమెరికా సుప్రీంకోర్టు.. గుండె పగిలిందన్న ఒబామా

Race of Reservation: యూనివర్సిటీల్లో జాతి, వర్ణం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సరికాదని అమెరికా అత్యున్నత న్యాయస్థానం గురువారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ తరహా ప్రవేశాలపై నిషేధం విధిస్తూ తీర్పు ఇచ్చింది. అఫర్మేషన్ యాక్షన్ అనేది అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికి, సమానత్వానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. స్టూడెంట్స్‌ ఫర్‌ ఫెయిర్‌ అడ్మిషన్స ఇంక్‌ అనే సంస్థ హార్వర్డ్‌ యూనివర్సిటీపై, మరికొందరు విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాపై వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించింది.

AP Politics: పులికేసి పాదయాత్రలో మంగళవారం మాటలు.. లోకేష్ యాత్రపై మంత్రి అనిల్ విమర్శలు

ఆఫ్రికన్-అమెరికన్లు సహా ఇతర మైనారిటీ వర్గాలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. 1960 వ సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ అడ్మిషన్లలో జాతి, తెగ లాంటి పదాలను రిజర్వేషన్ కేటగిరీ కింద ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఇక నుంచి ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని, ఆ పదాలను నిషేధిస్తున్నట్లు అమెరికా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. ‘‘ఒక విద్యార్థిని అతని అనుభవాల ఆధారంగా చూడాలి కానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీల్లో ఇకపై జాతి సంబంధింత అడ్మిషన్లు కొనసగానికి వీల్లేదు’’ అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తీర్పు కాపీని చదివారు.

PM Modi in Metro: ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమానికి మెట్రోలో వెళ్లిన ప్రధాని మోదీ

అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒక్క డొనాల్డ్ ట్రంప్ తప్ప.. ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షలు అందరూ దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికాకు గొప్ప రోజని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడగా.. ‘‘అఫర్మేటివ్‌ యాక్షన్ వల్ల మిషెల్లీ, నేను, పాతతరం వారు లబ్ధిపొందాం. ఇప్పుడు కొత్తతరం వారి అవకాశాలను అందుకోవడానికి మనమంతా సాయపడాలి’’ అని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయంతో తన గుండె పగిందని మిషెల్లీ ఒబామా అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఈ తర్పుపై విస్మయం వ్యక్తం చేశారు.