Fingers Color Changes : వాతావరణాన్ని బట్టి రంగులు మారిపోతున్న మహిళ చేతి వేళ్లు..వైరల్

Fingers Color Changes : వాతావరణాన్ని బట్టి రంగులు మారిపోతున్న మహిళ చేతి వేళ్లు..వైరల్

Fingers Changes

Updated On : April 28, 2021 / 2:05 PM IST

US womans Fingers Color Changes : అమెరికాకు చెందిన మోనికా అనే మహిళకు ఓ విచిత్రమైన సమస్య ఉంది. ఆమె చేతి వేళ్లు రంగులు మారిపోతుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఆమె చేతి వేళ్లు రంగులు మారిపోతుంటాయి. ఆమె చేతివేళ్లు అన్నీ వేళ్లు అలా మారవు. కేవలం రెండు వేళ్లుమాత్రమే రంగులు మారతాయి. మధ్య వేలు..దాని పక్కన ఉండే ఉంగరం వేలు వాతావరణంలో వచ్చిన మార్పులను బట్టి రంగులు మారతుంటాయి.

చల్లటి వాతావరణంలో ఎక్కువ సేపు ఉంటే ఆమె చేతి మధ్య, ఉంగరం వేళ్లు తెల్లగా మారిపోతాయి. అవి అలా కొద్ది సేపు మాత్రమే ఉంటాయి. కాసేపయ్యాక మళ్లీ సాధారణ రంగులోకి అంటే ఆమె శరీరపు రంగులోకి మారిపోతాయి. ఈ విషయాన్ని మోనికా కుమార్తె జూలీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రంగుమారిన చేతి వేళ్ల ఫొటోను పోస్ట్ చేసింది. మోనికా రంగులు మారే వేళ్లు తెగ వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

మోనికాకు ఉన్న అరుదైన వ్యాధి వల్లే ఇలా ఆమె వేళ్లు రంగులు మారతున్నాయని డాక్టర్లు తెలిపారు. ఇదొక అరుదైన చర్మవ్యాధి అని..ఈ వ్యాధి పేరు రెయినాడ్స్ సిండ్రోమ్ అని తెలిపారు. ఈ వ్యాధి ఉన్న వారి చర్మం కింద ఉండే అతి సన్నని రక్తనాళాలు కొన్ని సందర్భాల్లో మరింత సన్నగా మారిపోతాయనీ..దాంతో రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడి ఆ ప్రాంతంలోని చర్మం మొత్తం పాలిపోయినట్టు అవుతుందని తెలిపారు. చల్లని వాతావరణం కారణంగా మోనికా చేతివేళ్లలో కూడా ఇదే జరిగి అవి తాత్కాలికంగా రంగు మారుతాయట. ఆమెకుండే ఈ అరుదైన సమస్య వల్ల ఆమె చేతివేళ్ల ఫోటో వైరల్ అయ్యాయి.