USA : రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన అమెరికా

యుక్రెయిన్‌ వైపు దూసుకొస్తున్న రష్యా చర్యలపై బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుక్రెయిన్‌ ఆక్రమణకు రష్యా అడుగులు వేస్తోందని మండిపడ్డారు. దీంతో రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రకటించారు.

Biden

USA economic Restrictions : యుక్రెయిన్‌పై దండ‌యాత్రకు దిగిన ర‌ష్యాను ప్రపంచదేశాలు ఆంక్షల చట్రంలో ఇరికిస్తున్నాయి. యుక్రెయిన్‌ను ఆక్రమిస్తున్న రష్యాను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ముందునుంచి రష్యా తీరుపై భగ్గుమంటున్న అగ్రరాజ్యం.. అందరూ అనుకున్నట్లే ఆంక్షలకు తెరలేపింది. రష్యా… అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిందన్న బైడెన్… ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించారు. రెండు రష్యన్ బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యాతో గొడవపడే ఉద్దేశం లేదంటూనే… నాటో భూభాగంలోని అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. యుక్రెయిన్‌ను మద్దతు కొనసాగిస్తామన్న ఆయన.. అక్కడికి మరిన్ని బలగాలను పంపుతామన్నారు.

యుక్రెయిన్‌ వైపు దూసుకొస్తున్న రష్యా చర్యలపై బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుక్రెయిన్‌ ఆక్రమణకు రష్యా అడుగులు వేస్తోందని మండిపడ్డారు. దీంతో రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రెండు రష్యన్ బ్యాంకులపై ఆంక్షలు విధించారు. రష్యాతో వ్యాపార లావాదేవీలు నిలిపివేస్తామన్నారు. యుక్రెయిన్‌కు తాము మద్దతుగా నిలుస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ఇందుకోసం యుక్రెయిన్‌కు మరిన్ని బలగాలను పంపుతున్నట్లు తెలిపారు. రష్యాను ఎదుర్కోవడానికి అందరం ఏకమవుతామని.. నాటోకు చెందిన అంగుళం భూమిని కూడా వదులుకోబోమన్నారు.

India : యుక్రెయిన్‌కు రష్యా బలగాలను తరలించడంపై భారత్ అభ్యంతరం

యుక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలు డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ కు స్వతంత్ర హోదా గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకున్న రష్యా… ప్రస్తుతం పరిస్థితులను మరింత వేడెక్కించింది. పుతిన్ ఆదేశాలతో వేర్పాటు వాదుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల వైపు ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు వెళ్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రష్యా యుద్ధ ట్యాంకులు కనిపించినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని యుక్రెయిన్‌ అధ్యక్షుడు ప్రకటించారు. దేనికీ భయపడబోమని.. తమ భూభాగంలో అంగుళం కూడా వదులుకోమని తెలిపారు.