కరోనాకు మరో మందు, Erythropoietin (Epo)

  • Publish Date - July 4, 2020 / 01:40 PM IST

కరోనాకు మరో మందు వచ్చేసింది. దాని పేరు ఎరిత్రో పోయ్ టిన్ (Erythropoietin). ఎపో(Epg) అని పిలుస్తారు. కరోనా చికిత్సలో డోపింగ్ ఏంజెట్ ఎపో మెడిసిన్ బాగా పని చేస్తోందని జర్మనీలోని Max Planck Institute of Experimental Medicine in Göttingen పరిశోధకులు చెప్పారు. SARS-CoV-2 వైరస్ మెదడుపై దాడి చేసినప్పుడు రోగులను దీర్ఘకాలిక నాడీ ప్రభావాల నుండి ఈ మెడిసిన్ ప్రభావవంతంగా కాపాడుతుందని తెలిపారు. COVID-19 రోగుల్లో ఎపో చికిత్స ప్రభావాలను క్రమపద్ధతిలో పరిశోధించడానికి పరిశోధకులు క్లినికల్ ట్రయల్‌ను ప్లాన్ చేస్తున్నారు.

కరోనా రోగుల్లో మెరుగైన ఫలితాలు:
ఈ ఏడాది మార్చి చివరలో తీవ్రమైన COVID-19 లక్షణాలతో ఓ రోగి ఇరానియన్ ఆసుపత్రిలో చేరాడు. అతడిలో బ్లడ్ లెవెల్స్ సరిగా లేనందున, డాక్టర్లు హేమాటోపోయిటిక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఎపోను సూచించారు. చికిత్స ప్రారంభించిన ఏడు రోజుల తర్వాత రోగి కోలుకున్నాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యాడు. అనీమియా(రక్తహీనత) రోగులకు చికిత్సలో ఎపోని మెడిసిన్ గా వాడతారు. ఆ మందే.. ఇప్పుడు కరోనా రోగుల చికిత్సలోనూ ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మెడిసిన్ ద్వారా కరోనా రోగులు కోలుకుంటున్నట్లు గుర్తించారు. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

నాడీ వ్యాధులు నయం:
జంతువులపై ప్రయోగాలు చేసినప్పుడు.. మెదడు, వెన్ను ప్రాంతాలపై ఎపో బాగా పనిచేస్తుందని తేలింది. ఆక్సిజన్ లోపం ఉన్నప్పుడు శ్వాస మెరుగుపడుతున్నట్టు గుర్తించారు. కరోనా రోగుల్లో రోగనిరోధక ప్రతి స్పందనను పెంచుతుందని గుర్తించారు. ఇది నాడీ వ్యాధులు, సుదీర్ఘమైన వ్యాధులు తలనొప్పి, డిజినెస్, వాసన, రుచి కోల్పోవడం, మూర్ఛ వంటి దీర్ఘకాలిక ప్రభావాల నుండి కూడా రక్షించగలదని తేలింది.

ఇప్పటికే వచ్చిన కరోనా మందులు ఇవే:
కరోనాకు మందుగా ఇప్పటికే పలు మెడిసిన్లు వచ్చాయి. ఫాబిఫ్లూ (FabiFlu), కోవిఫోర్ (Covifor) సిప్రెమీ (Cipremi) మందులు అందులో భాగమే. కోవిఫోర్‌ను హెటెరో ఫార్మా కంపెనీ… రెమ్‌డెసివిర్‌తో తయారుచేయగా… సిప్లా కూడా అదే రెమ్‌డెసివిర్‌తో… సిప్రెమీని తయారుచేసింది. ఇది కూడా కోవిఫోర్ లాగా… ఇంజెక్షన్ లాగే ఉంటుంది. ఈ రెండు కంపెనీలూ… కలిసి ఈ మందును ఉత్పత్తి చేశాయి. రెండు కంపెనీలూ… వేర్వేరు పేర్లతో ఇంజెక్షన్‌ను తయారుచేశాయి. తమ సొంతంగా, ఇతర సంస్థలతో కలిసి… సిప్రెమీని ఉత్పత్తి చేస్తామని ముంబైకి చెందిన సిప్లా తెలిపింది. ఫాబిఫ్లూ అనే టాబ్లెట్లు… కరోనా చాలా తక్కువగా, మధ్యస్థాయిలో ఉన్నవారికి ఇచ్చేందుకు వీలవ్వనుండగా… ఈ కోవిఫోర్, సిప్రెమీ ఇంజెక్షన్లను కరోనా చాలా ఎక్కువగా అంటే ఆక్సిజన్ సపోర్టుతో ట్రీట్‌మెంట్ పొందుతున్నవారికి ఇవ్వొచ్చని తెలిసింది. పెద్దవాళ్లు, పిడియాట్రిక్ పేషెంట్లకు దీన్ని ఇవ్వొచ్చని కంపెనీ వివరించింది.

Read:కరోనా ఎఫెక్ట్: ఆన్ లైన్ క్లాసెస్ కోసం తల్లిదండ్రులు తిప్పలు

ట్రెండింగ్ వార్తలు