37 ఏళ్ళ అమెరికా యువతిపై అత్యాచారం

  • Published By: murthy ,Published On : October 9, 2020 / 10:21 AM IST
37 ఏళ్ళ అమెరికా యువతిపై  అత్యాచారం

Updated On : October 9, 2020 / 10:58 AM IST

Yoga Enthusiast From US Raped : భారతదేశంలోని మహిళలకే కాదు…విదేశాల నుంచి వచ్చిన మహిళలకు దేశంలో భద్రత కరువైందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తే … యూఎస్ నుంచి వచ్చి, ఉత్తారఖండ్ లో జీవిస్తున్న ఒక పర్యాటకురాలిపై ఒక వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు హరిద్వార్ లోని ముని కి రేటి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళ యోగా మీద ఆసక్తితో భారత్ లోని ఉత్తరాఖండ్ వచ్చి నివాసం ఏర్పరుచుకుంది. డ్రగ్స్, యోగా పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో… ఇంటికి సమీపంలోని అభినవ్ రాయ్ ఆమెకు పరిచయం అయ్యాడు. అక్టోబర్ 5న అభినవ్ రాయ్ ఆమె ఫ్లాట్ బాల్కనీలోంచి దూకివచ్చి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.



కాగా.. ఇంతకు ముందే వీరిద్దిరి మధ్య లైంగిక సంబంధం ఉందని…… గతంలోనే వారిద్దరూ పలుమార్లు లైంగికంగా కలిసినట్లు ముని కి రేటి పోలీసు స్టేషన్ ఇన్ చార్జి ఆర్కే సక్లానీ తెలిపారు. కేసును ఉపసంహరించుకోమని అభినవ్ రాయ్ తండ్రి మహిళపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆమె ఆరోపించింది.