ప్రపంచంలోనే అంత్యంత అరుదైన రెండు తెల్లజిరాఫీలను హతమార్చిన వేటగాళ్లు..ఇక అవి అంతరించిపోయినట్లే!!

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 04:08 AM IST
ప్రపంచంలోనే అంత్యంత అరుదైన రెండు తెల్లజిరాఫీలను హతమార్చిన వేటగాళ్లు..ఇక అవి అంతరించిపోయినట్లే!!

Updated On : March 12, 2020 / 4:08 AM IST

కెన్యా దేశంలో అరుదైన తెల్లటి జిరాఫీ లను కొందరు వేటగాళ్లు హతమార్చినట్లు తెలుస్తుంది. దీనితో ఆఖరి తెల్ల జిరాఫీ అంతరించి పోయింది. ఇటీవల కెన్యా దేశంలో తెల్లని ఓ అరుదైన ఆడ జిరాఫీ ఒక కూనకు జన్మనిచ్చింది. అయితే దానిని జాగ్రత్తగా 

ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్లజిరాఫీలను కొందరు వేటగాల్లు హతమార్చారు. ఈ ఘటనలో తూర్పు కెన్యాలోని గారిస్సాలో ఉండే ఆఖరి తెల్ల జిరాఫీ..దాని చిన్నారి కూన కూడా వేటగాళ్ల దురాగతానికి అంతరించి పోయింది. ఇటీవల కెన్యా దేశంలో తెల్లని ఓ అరుదైన ఆడ జిరాఫీ ఒక కూనకు జన్మనిచ్చింది. దానిని అధికారులు అతి జాగ్రత్తగా కాపాడుకుంటు వస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులకు ఆశపడ్డ కొందరు దుండగులు ఆ ఆఖరి తెల్ల జిరాఫీని, దాని 7 నెలల కూనను హతమార్చారని వాటి అస్థిపంజరాలు లభించాయని జిరాఫీలు నివసించిన ఈశాన్య కెన్యాలోని ఇషాక్‌బిని హిరోలా కమ్యూనిటీ కన్జర్వెన్సీ మేనేజర్ మహ్మద్ అహ్మద్‌నూర్ ప్రకటించంది. 

ఈ దారుణం వెలుగులోకి రావడంతో కెన్యా ప్రభుత్వతో పాటు అధికారులు..ప్రజానీకం కూడా తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో నెటిజన్లు కూడా కంటతడి పెడుతున్నారు. అరుదైన జంతువులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని..కేవలం డబ్బుల కోసం దుండగులు ఇటువంటి దురాగతాలకు పాల్పడటం దారుణమని ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు వాపోతున్నారు. 

ప్రపంచంలో కేవలం రెండే తెల్ల జిరాఫీలు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకూ మేమే వాటిని సంరక్షిస్తూ వచ్చాము. అయితే ఈ రోజు వాటిని కూడా కోల్పోయాము’  ‘కెన్యా మొత్తానికి ఈ రోజు చాలా విచారకరమైందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  వేటగాళ్ల కారణంగా అత్యంత అరుదైన ఈ తెల్ల జిరాఫీ ల జాతి ఇక అంతరించిపోయినట్లే అని అధికారులు తీవ్ర విషాదంతో తెలిపారు. తెల్ల జిరాఫీలను సంరక్షించే ఏకైన సంఘం మేమే ఉన్నామనీ…కానీ ఇప్పుడు ఆ రెండు ప్రపంచం మొత్తంలో ఉన్న రెండే రెండు తెల్లజిరాఫీలను వేటగాళ్ల వల్ల కోల్పోయామని ఇషాక్‌బిని హిరోలా కమ్యూనిటీ కన్జర్వెన్సీ తీవ్ర ఆవేదనతో తెలిపింది. 

అత్యంత అరుదుగా ఉండే తెల్ల జాతుల్ని రక్షించుకోవాలి
రంగుల్లో తెలుపుకు రంగుకు ఎంత ప్రత్యేకత ఉందో తెలిసిందే. శాంతికి చిహ్నం తెలుపు. రంగులు ఎన్ని ఉన్నా..తెలుపుకి ఉండే ప్రత్యేకతే వేరు.అలాగే జంతువులు..పక్షులు..క్షీరదాల్లో తెలుపుకి కూడా అంతే ప్రత్యేకత ఉంది. పెద్ద పులిని మామూలుగానే చూస్తాం..కానీ తెల్ల పెద్దపులిని మాత్రం ప్రత్యేకంగా చూస్తాం. అలా నెమళ్లలో తెల్ల నెమలి..తిమింగలాల్లో తెల్ల తిమింగిలం..చిలుకల్లో తెల్ల చిలుకలు..సింహాల్లో తెల్ల సింహం ఇలా చెప్పుకుంటూ పోతే..తెల్లని జంతువులకు..ప్రాణులకు చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని ఆయా దేశాల అధికారులు కూడా చాలా చాలా ప్రత్యేకంగా సంరక్షిస్తుంటారు.

ఈ క్రమంలో  కెన్యాలోని ఇషాక్‌బిని హిరోలా కమ్యూనిటీ కన్జర్వెన్సీ ప్రపంచ వ్యాప్తంగా ఉండే రెండే తెల్ల జిరాఫీలను అంత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తూ వస్తోంది. కానీ వేటగాళ్ల ధన దాహానానికి ఆ రెండూ కూడా బలైపోయాయి. ఇక తెల్ల జిరాఫీలను చూడాలంటే ఇంటర్ నెట్ లో చూసుకోవాల్సిందేనంటున్నారు. 

కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు జాతులు అంతరించిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం అతి తక్కువ సంఖ్యలో ఉన్న జాతులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రకృతిలో భాగమైన జంతువుల మనుగడ కోల్పోతే..మానవాళి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుందనే మానవజాతి తెలుసుకోవాలి.

See Also | ఎవరీ పుష్పం ప్రియా? బిహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి లండన్ మహిళ