Apple iPhone 15 : అమెజాన్ ఆఫర్ అదిరింది.. ఈ ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Apple iPhone 15 : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ అద్భుతమైన ఆఫర్.. రూ.13వేల లోపు ధరలో ఐఫోన్ 15 ధర తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 15 : అమెజాన్ ఆఫర్ అదిరింది.. ఈ ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Apple iPhone 15

Updated On : August 23, 2025 / 1:07 PM IST

Apple iPhone 15 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. అందులోనూ ఐఫోన్ 15 కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం (Apple iPhone 15) భారీ ధర తగ్గింపుతో అందిస్తోంది. రూ.13వేలకు పైగా డిస్కౌంట్ పొందవచ్చు.

ఒకవేళ, మీ పాత ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా లేదా వేరే బ్రాండ్ నుంచి మారాలనుకుంటున్నారా? ఈ ఆఫర్‌ను ఇప్పుడే చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పడే కొనేసుకోవడం బెటర్.

Read Also : Motorola Edge 50 Fusion : కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఐఫోన్ 15 అమెజాన్ డీల్ :

ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 15 రూ.69,900కి లిస్ట్ అయింది. అమెజాన్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ.13,310 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తద్వారా ధర రూ.56,590కి తగ్గింది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.

Apple iPhone 15 Sale

Apple iPhone 15

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

ఐఫోన్ 15 6.1-అంగుళాల XDR OLED డిస్‌ప్లే, 1179 x 2556 పిక్సెల్స్ రిజల్యూషన్‌ కలిగి ఉంది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్, HDR10 కూడా సపోర్టు ఇస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఐఫోన్ 15 ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. 6GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది.

ఈ ఫోన్ వైర్‌లెస్ రివర్స్-వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 3349mAh బ్యాటరీని అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.

ధర తగ్గింపుతో పాటు, ఐఫోన్ 15 కొనుగోలుపై రూ.3వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ.61,900కి తగ్గుతుంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.