Chinese Toddler Viral Video : ఈ చైనీస్ బుడ్డోడి కుకింగ్ స్కిల్స్ చూడండి.. వారెవ్వా అంటారు

చిన్న పిల్లల్ని వంటింట్లోకి రానివ్వం. అలాంటిది స్టవ్ దగ్గర నిలబడి వంట చేయడం అంటే.. ఓ చైనీస్ బాలుడు గరిట తిప్పుతూ వంటలు చేసేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Chinese Toddler Viral Video : ఈ చైనీస్ బుడ్డోడి కుకింగ్ స్కిల్స్ చూడండి.. వారెవ్వా అంటారు

Chinese Toddler Viral Video

Chinese Toddler Viral Video : చిన్న పిల్లలు పెద్దవాళ్లను అనుకరిస్తుంటారు. కొన్ని పనులు పెద్దవాళ్లకంటే నైపుణ్యంతో చేస్తుంటారు. ఓ చైనీస్ బాలుడు వంట చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి కుకింగ్ స్కిల్స్ చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు.

Amitabh Bachchan: కేవలం 10 నిమిషాలలో వైద్య నిపుణులతో వీడియో సంప్రదింపులు

చైనీస్ బాలుడి కుకింగ్ స్కిల్స్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. @OliviaWong123 అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో బుల్లి చెఫ్ వంట చేస్తూ గరిట తిప్పే విధానం అందరి మనసులు కొల్లగొట్టింది. ఈ బాలుడు నెలల వయసులో ఉన్నప్పుడే వంట చేయడం పట్ల ఆసక్తి కనపరిచేవాడట. టీవీలో వచ్చే వంటల కార్యక్రమాలు చూపిస్తుంటే ఆ చెఫ్‌లను అనుకరించడం మొదలుపెట్టాడట. వీడియోలో బాలుడు ఒక గరిటెతో వోక్‌ని ఎంతో టెక్నిక్‌గా వండుతూ తన అద్భుతమైన స్కిల్స్‌ని ప్రదర్శించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Typhoon Saola: 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు బయటికి రావొద్దని చైనాలో ఆదేశాలు.. ఎందుకో తెలుసా?

‘పిల్లవాడి నైపుణ్యం అద్భుతంగా ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మరో వీడియోలో పిల్లవాడు ‘ఫ్రైడ్ రైస్’ తయారు చేస్తూ కనిపించాడు. ఇలా కొందరు పిల్లల్లో అరుదైన టాలెంట్‌కి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌‌లో చాలానే ట్రెండ్ అవుతున్నాయి.