Humanoid Robots: టెక్నాలజీ నెక్ట్స్ లెవెల్.. సన్యాసులతో కలిసి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేస్తున్న రోబోలు.. వీడియో వైరల్
ఈ రోబోలను షాంఘైకి చెందిన అగిబాట్ (AgiBot) అనే కంపెనీ నిర్మించింది. AI-శక్తితో పనిచేసే హ్యూమనాయిడ్ యంత్రాలను తయారు చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది అగిబాట్.
Humanoid Robots Representative Image (Image Credit To Original Source)
- సన్యాసులతో కలిసి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేసిన రోబోలు
- ఏఐతో పని చేసే హ్యుమనాయిడ్ రోబోలు
- చైనా కంపెనీ సరికొత్త ఆవిష్కరణ
Humanoid Robots: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఊహకు కూడా అందనివి, కొత్త కొత్తవి ఆవిష్కారం అవుతున్నాయి. టెక్నాలజీ ద్వారా అబ్బురపరిచే రీతిలో ఆవిష్కరణలు కనుగొంటున్నారు. ఇక, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రాకతో సాంకేతిక పరిజ్ఞానం మరింతగా డెవలప్ అయ్యింది. ఏఐ టెక్నాలజీ అద్భుతాలను సృష్టిస్తోందని చెప్పాలి. అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం చేస్తోంది ఏఐ.
ఇప్పుడు ఏఐ వాడకం నెక్ట్స్ లెవెల్ కి చేరిందని చెప్పాలి. AI అభివృద్ధి చెందుతూనే ఉండటంతో రోబోలు సాంప్రదాయకంగా మానవులకు కేటాయించబడిన పాత్రల్లోకి అడుగుపెడుతున్నాయి. రోబోలకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో రోబోలు సన్యాసులతో కలిసి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పుడీ వీడియో అందరినీ అబ్బురపరుస్తోంది. చైనా నుండి వచ్చిన తాజా వీడియోలో చరిత్రాత్మక షావోలిన్ ఆలయంలో సన్యాసులతో కలిసి కుంగ్ ఫూ సాధన చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోలు కనిపిస్తున్నాయి.
రోబోలను తయారు చేసిన AgiBot..
ఈ రోబోలను షాంఘైకి చెందిన అగిబాట్ (AgiBot) అనే కంపెనీ నిర్మించింది. AI-శక్తితో పనిచేసే హ్యూమనాయిడ్ యంత్రాలను తయారు చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది అగిబాట్. బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో షావోలిన్ సన్యాసులతో రోబోలు శిక్షణ పొందడం, మార్షల్ ఆర్ట్స్ కదలికలను కాపీ చేయడం వంటివి ఉన్నాయి.
వాస్తవ ప్రపంచ వాతావరణాల కోసం నిర్మించబడిన అగిబాట్ హ్యూమనాయిడ్లు వాటి పరిసరాలను నావిగేట్ చేయగలవు. పారిశ్రామిక ఉద్యోగాల నుండి మార్షల్ ఆర్ట్స్ కసరత్తులతో సహా డైనమిక్ కార్యకలాపాల వరకు సంక్లిష్టమైన భౌతిక పనులను నిర్వహించగలవు.
అటు పురాతన కళ.. ఇటు అత్యాధునిక సాంకేతికత..
అల్గోరిథం, సెన్సార్ల ద్వారా పని చేసే ఈ యంత్రాలు.. మాంక్స్ తో కలిసి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా హైలైట్. సంస్కృతి, సాంకేతికతను మిళితం చేస్తూ రూపొందించిన ఆవిష్కరణలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ టెక్నాలజీ అందరినీ అబ్బురపరిచేలా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. చాలామంది చైనా వేగవంతమైన సాంకేతిక పురోగతిని ప్రశంసిస్తున్నారు. అటు 1500 ఏళ్ల నాటి పురాతమైన యుద్ధ కళ, ఇటు అత్యాధునిక సాంకేతికత ఏఐతో రూపొందించబడిన హ్యుమనాయిడ్ రోబోలు… ఈ రెండు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం.. నిజంగా అద్భుతం అంటున్నారు నెటిజన్లు. సన్యాసులతో కలిసి రోబోలో మార్షల్ ఆర్ట్ ను ప్రాక్టీస్ చేయడం.. రియల్లీ గూస్ బంప్స్ అంటున్నారు.
మరోవైపు హ్యూమనాయిడ్ రోబోలు షావోలిన్ సన్యాసులతో కుంగ్ ఫూను అభ్యసించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అగిబాట్ రోబోలు యుద్ధ కళల కదలికలను అనుకరిస్తాయి కానీ నిజమైన అభ్యాసం, అనుకూలతను కలిగి ఉండవని అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇలా ఉంటే చైనా సంప్రదాయం, సాంకేతికత, వేగవంతమైన ఆవిష్కరణల మిశ్రమానికి ఈ వీడియో అద్దం పడుతోంది.
Also Read: చైనా చేతిలో పవర్ఫుల్ వెపన్.. ఒక్కదెబ్బకు శాటిలైట్లను మసి చేస్తుంది.. బాబోయ్.. యమా డేంజర్..
View this post on Instagram
