United States : యాంకర్‌కి లైవ్‌లో ప్రపోజ్ చేసిన రిపోర్టర్.. ఎక్కడంటే?
ఓ టీవీ ఛానల్ పని చేస్తున్న యాంకర్‌కి అదే ఛానల్లో పనిచేస్తున్న రిపోర్టర్ ప్రపోజ్ చేశాడు. అదీ లైవ్ ప్రసారంలో.. ఆ యాంకర్ అతని ప్రేమను అంగీకరించిందా? చూడండి.

United States
United States : యుఎస్ రిపోర్టర్ లైవ్‌లో న్యూస్ యాంకర్, గర్ల్ ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసాడు. ఆ వీడియో ఇంటర్నెట్ మనసు దోచుకుంది.
viral video : లైవ్‌లో తడబడిన బీబీసీ యాంకర్.. వైరల్ అవుతున్న వీడియో
యునైటెడ్ స్టేట్స్‌లోని టేనస్సీలో ఓ న్యూస్ ఛానెల్లో ప్రసారమైన లైవ్ కంటెంట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు వారి మనసు దోచుకుంది. ఎన్బిసి అనుబంధ ఛానెల్ WRCB-TV లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్న ‘కార్నెలియా నికల్సన్’కి ఆమె కొలీగ్, కాబోయే భర్త ‘రిలే నాగెల్’ లైవ్‌లో ప్రపోజ్ చేయడం వైరల్‌గా మారింది. కార్నెలియా నికల్సన్ న్యూస్ చదువుతుండగా రిలే నాగెల్ చేతిలో ఉంగరం, బొకేతో సెట్లోకి వచ్చాడు. మోకాలిపై నిలబడి తనను పెళ్లిచేసుకోమని అడిగాడు. దానికి ఆమె ఎమోషనల్ అవుతూ అతని ప్రపోజల్ అంగీకరించింది.
Varshini Sounderajan : హైపర్ ఆదితో పెళ్లి రూమర్స్.. స్పందించిన యాంకర్..
ప్రపోజ్ చేయడానికి ముందు రిలే నాగెల్ కార్నెలియా నికల్సన్ గురించి గొప్పగా చెప్పాడు. ఆమెను నాలుగు సంవత్సరాల క్రితం మోంటానాలోని ఓ న్యూస్ ఛానల్లో కలిసినట్లు చెప్పాడు. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పాడు. ఆమెలో గొప్ప వ్యక్తిత్వాన్ని చూసానని, తను ఎక్కడ ఉంటే అక్కడ వెలుగులు నిండిపోతాయని, అందరినీ నవ్విస్తుందని’ ప్రియురాలిని పొగుడుతూ తరువాత రింగ్ తొడిగాడు. ఇంటర్నెట్లో వీరి వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు అభినందనలు తెలిపారు.
View this post on Instagram