Snake Under Child’s Toy: చిన్నారి ఆటబొమ్మలో భయంకర పాము.. వీడియో చూశారా?
చిన్నారి ఆడుకునే బౌన్సీ చైర్‌లో పామును గుర్తించిన కుటుంబ సభ్యులు.. పాములు పట్టే వాళ్లకు ఫోన్ చేశారు.

చిన్నారి ఆడుకునే బొమ్మలో భయంకర టైగర్ పాము కనపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారులు ఆడుకునే బౌన్సీ చైర్‌లో పామును గుర్తించిన కుటుంబ సభ్యులు.. పాములు పట్టే వాళ్లకు ఫోన్ చేశారు. దీంతో పాములు పట్టేవారు వచ్చి ఆ పామును పట్టి సురక్షితంగా తీసుకెళ్లారు.
“క్రిస్‌మస్ నైట్ అమ్మ, నాన్న రాత్రిపూట లాంజ్ గుండా ఒక పాము పాకడం, అది పిల్లల బౌన్సర్ కింద దాక్కోవడాన్ని గమనించారు. మొదటి దీన్ని అమ్మ, నాన్న నమ్మలేకపోయారు” అని ఆ కుటుంబంలోని ఓ పిల్లాడు చెప్పాడు.
అంత భయంకర పాము ఇంట్లోకి చొరబడడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ పాము కాటు వేస్తే బతకడం కష్టమని ఓ యూజర్ పేర్కొన్నాడు.
View this post on Instagram