Russia – Ukraine War: లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదు – పుతిన్

యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మీడియాకు ముందుకొచ్చిన రష్యా ప్రెసిడెంట్ యుద్ధం ఆపేది లేదని...

Russia – Ukraine War: లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదు – పుతిన్

Russia Putin Subhan 10tv

Updated On : March 5, 2022 / 8:22 PM IST

Russia – Ukraine War: యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మీడియాకు ముందుకొచ్చిన రష్యా ప్రెసిడెంట్ యుద్ధం ఆపేది లేదని కన్ఫామ్ చేశారు. యుక్రెయిన్ పై రెండో వారం మిలటరీ బలగంతో జరుపుతున్న దాడులపై స్పందిస్తూ మార్షల్ లా తీసుకురావాల్సిన అవసరం లేదని అన్నారు.

‘అంతర్గత లేదా బాహ్య ఉన్నప్పుడే అటువంటి చర్య విధించాలని, ప్రస్తుతం మేం దానిని ఫేస్ చేయడం లేదు. ఇకపై రాదని ఆశిస్తున్నా’ అని పుతిన్ తమ ఉద్యోగులతో కలిసి నిర్వహించిన మీటింగ్ లో వెల్లడించారు.

రష్యాపై పాశ్చాత్య ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని, నాటో దేశాలు దీనికి సరైన మూల్యం తప్పక చెల్లించుకుంటాయని తేల్చి చెప్పారు. యుక్రెయిన్ లో నో ఫ్లై జోన్ విధించే ఏ ప్రయత్నమైనా… సంఘర్షణకు తావిచ్చినట్లేనని అన్నారు. దాంతో పాటుగా లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదని, ఎంతో ఆలోచించాకే యుక్రెయిన్ పై దాడి మొదలుపెట్టామని స్పష్టం చేశారు.

Read Also : యుక్రెయిన్ పై యుద్ధం అంతా నేను ప్లాన్ చేసినట్లే జరుగుతోంది..టార్గెట్స్ రీచ్ అయ్యాం : పుతిన్

‘ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ అణ్వాయుధాలకు నిలయంగా ఉండదు. శాంతి ఒప్పందాన్నియుక్రెయిన్ ఉల్లంఘించింది. ఊహించిన దాని కంటే యుద్ధం భీకరంగా సాగింది’ అని తెలిపారు.