viral Video : హెజ్‌బొల్లా ఉగ్రదాడులను ఇలా తిప్పికొట్టాం.. వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

తమపై దాడులు చేయడానికి హెజ్‌బొల్లా లెబనాన్ లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను ..

viral Video : హెజ్‌బొల్లా ఉగ్రదాడులను ఇలా తిప్పికొట్టాం.. వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

Israel Defense Forces

Israel Defense Forces : పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారు జామున దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా.. ప్రతిగా హెజ్‌బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. లెబనాన్ పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరానలు ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. ఉత్తర, మధ్య ఇజ్రాయెల్ లోని లక్ష్యాలపై హెజ్‌బొల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

Also Read : Russia-Ukraine Conflict : అందరితో భారత్ స్నేహగీతం.. చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టే ప్లాన్..!

తమపై దాడులు చేయడానికి హెజ్‌బొల్లా లెబనాన్ లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను, క్షిపణులను హెజ్‌బొల్లా ప్రయోగించనుందనే సమాచారం అందాకే వైమానిక దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. తమకు నష్టం కలగజేసే వారికి తప్పకుండా నష్టం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపాడు. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఓ వీడియోను విడుదల చేసింది.

Also Read : మోదీ, జెలెన్‌స్కీ చ‌ర్చ‌లు జ‌రిపిన మారిన్స్కీ ప్యాలెస్‌కు.. నాటునాటు సాంగ్‌కు సంబంధం ఏమిటో తెలుసా?

హెజ్‌బొల్లా ఉగ్రదాడులను ఇలా తిప్పికొట్టామని పేర్కొంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఇలా పేర్కొంది.. హెజ్‌బొల్లా నుండి పెద్ద ఎత్తున తీవ్రవాద దాడిని ఆపడానికి ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) ఎలా పని చేసిందో చూడండి. లెబనాన్‌లో మా ఆపరేషన్ ఇజ్రాయెల్ కుటుంబాలను, ఇళ్లను రక్షించడానికి చేసిందేనని ఇజ్రాయెల్ పేర్కొంది.