Viral Video : లేచినవేళ బాగున్నట్టుంది.. అతన్ని మృత్యువు ఇలా టచ్ చేసి వెళ్లిందిగా..!

Viral Video : లేచినవేళ బాగుంది అంటే.. ఇదే కావొచ్చు.. మృత్యువు కబళించేందుకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. రోడ్డుపక్కన నిల్చొని ఉన్న ఆ వ్యక్తిపైకి ఓ వాహనం వేగంగా దూసుకొచ్చింది.

Viral Video : లేచినవేళ బాగున్నట్టుంది.. అతన్ని మృత్యువు ఇలా టచ్ చేసి వెళ్లిందిగా..!

Watch Man's Incredibly Lucky Escape After Truck Veers Off Road

Updated On : May 31, 2022 / 7:52 PM IST

Viral Video : లేచినవేళ బాగుంది అంటే.. ఇదే కావొచ్చు.. మృత్యువు కబళించేందుకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. రోడ్డుపక్కన నిల్చొని ఉన్న ఆ వ్యక్తిపైకి ఓ వాహనం వేగంగా దూసుకొచ్చింది. ఆ వీడియో చూస్తుంటే అతడి పని అయిపోయినట్టే అనిపించేలా ఉంది.. కానీ, అదృష్టవశాత్తూ అతడికి ఏమికాలేదు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. వాహనం అంచు మాత్రమే అతన్ని తగలడంతో పక్కకు ఒరిగాడు. పక్కనే గోడ..  భారీ వాహనం రెండింటి మధ్య అతడు నిలబడిపోయాడు.

వేగంగా దూసుకొచ్చిన ఆ భారీ వాహనం గాల్లో ఎగురుకుంటూ ఆ వ్యక్తిపై వచ్చి పడింది. చేతిలో హెల్మెట్‌ పట్టుకుని ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలుచుని ఉన్నాడు. అటుగా వస్తున్న ట్రక్కు చెట్టు కొమ్మలకు బలంగా తాకింది. దాంతో ఒక్కసారిగా ఎగిరిపడింది. వేగంగా కుడివైపునకు దూసుకెళ్లింది.

అమాంతం పైకిలేచి ఫుట్‌పాత్‌మీదుగా పరుగులు పెట్టింది. వెంటనే తెరుకున్న అతడు భయంతో అక్కడి నుంచి పరిగెత్తాడు. ఈ భయానక ఘటన బ్రెజిల్‌లో జరిగింది. భూమిపై నూకలు ఉంటేనే ఇలాంటి పెను ప్రమాదాల నుంచి సైతం ప్రాణాలతో బయటపడతారంటే అది నిజమే కావొచ్చు. 56 సెకన్లు ఉన్న ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Read Also : Viral Video : ఆ పిల్లాడికి ఆటిజం.. స్విమ్మింగ్‌ఫూల్‌లో దూకేశాడు.. తండ్రి ఎలా కాపాడాడో చూడండి..!