బ్రిడ్జికి వేలాడుతూ నదిలో పడబోయిన లారీ.. అందులోని మహిళా డ్రైవర్‌ను ఇలా కాపాడిన సిబ్బంది

Viral Video: మహిళా డ్రైవర్ మొత్తం 45 నిమిషాల పాటు వేలాడుతున్న లారీలోనే ఉండిపోయిందని అధికారులు తెలిపారు.

బ్రిడ్జికి వేలాడుతూ నదిలో పడబోయిన లారీ.. అందులోని మహిళా డ్రైవర్‌ను ఇలా కాపాడిన సిబ్బంది

బ్రిడ్జికి వేలాడుతూ నదిలో పడబోయింది ఓ లారీ. దానికి 75 అడుగుల కింద నీరు ఉంది. లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయింది. ఆ మహిళా డ్రైవర్‌ను అందులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఫైర్‌ఫైటర్స్. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేశారు.

అమెరికాలోని కెంటుకీలో ఈ ఘటన చోటుచేసుకుంది. లారీని నడుపుతూ బ్రిడ్జి వద్దకు వచ్చిన మహిళా డ్రైవర్ అదుపుతప్పి అక్కడి బారియర్స్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ లారీ వంతెన పై నుంచి వేలాడింది. లారీలోనే ఉండిపోయిన డ్రైవర్ నీళ్లలో పడిపోతానేమోనని భయపడింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్‌ఫైటర్స్ అక్కడకు చేరుకుని దాదాపు కొన్ని నిమిషాలపాటు శ్రమించి.. రోప్స్, లాడర్ల సాయంతో ఆ మహిళా డ్రైవర్‌ను పైకి తీసుకొచ్చారు. డ్రైవర్ మొత్తం 45 నిమిషాల పాటు వేలాడుతున్న లారీలోనే ఉండిపోయిందని అధికారులు తెలిపారు. డ్రైవర్‌ను పైకి తీసుకొచ్చాక లారీని కూడా పలు యంత్రాల సాయంతో పైకి లాగామని అధికారులు వివరించారు.

Visakha Sai Case : రూ.12లక్షల కెమెరా కోసమే హత్య..! సంచలనం రేపిన విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి కేసులో వీడుతున్న మిస్టరీ