వీడియో: పులి పంజా.. పిల్లాడి పై దాడి చేసేందుకు పరిగెత్తుకొచ్చింది

సాధారణంగా చిన్న పిల్లలు జూ కు వెళ్ళి జంతువులను చూటానికి ఇష్టపడతారు. పులితో ఆట నాతో వేట ఒక్కటే వంటి పంచ్ డైలాగులు గుర్తుండే ఉంటాయి. కానీ పులికి ఎవరూ ఎదురు వెళ్ళక పోయినా పులే వచ్చి నేరుగా దాడి చేసింది. ఈ ఘటన ఐర్లాండ్ లోని దుబ్లిన్ జూ లో పులి ఐరిష్ అనే 7ఏళ్ల పిల్లాడిపై దాడి చేయటానికి ప్రయత్నించింది.
వివరాల్లోకి వెళ్లితే ఐర్లాండ్ లో ఓ కుటుంబం అంతా కలిసి సరదాగా జంతువులను చూడటానికి దుబ్లిన్ జూ కు వెళ్ళింది. అక్కడ ఐరిష్ ను ఫోటో దించటానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.ఇంతలో ఓ పులి పిల్లవాడిని చూసి నెమ్మదిగా అతని వైపు వస్తోంది. ఐరిష్ వెనకు తిరిగి చూడగా పులి కనిపించింది. అదేమి తెలియనట్టు ఫోటోకి ఫోజులు ఇస్తుండగా ఒక్క సారిగా పులి ఐరిష్ పై దాడి చేయబోయింది.
కానీ గాజు గ్లాస్ అడ్డుగా ఉండటంతో పులి దాడి నుంచి పిల్లవాడు తప్పించుకున్నాడు. గాజు గ్లాస్ లేకపోతే ‘నా కొడుకు పులికి ఆహారం అయ్యేవాడు’ అని పిల్లవాడి తండ్రి వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లవాడికి తీపి గుర్తుగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
My son was on the menu in Dublin Zoo today #raar pic.twitter.com/stw2dHe93g
— RobC (@r0bc) December 22, 2019