ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న ఇరాన్.. ఇజ్రాయెల్‌కు అతిపెద్ద శత్రువుగా ఎలా మారింది? అసలేం జరిగింది..

అప్పటి నుంచి రెండు దేశాల మధ్య శత్రుత్వం కంటిన్యూ అవుతోంది. అలా.. ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్రువు అయిన ఇరాన్.. ఇప్పుడు బద్ధ శత్రువుగా మారిపోయింది.

ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న ఇరాన్.. ఇజ్రాయెల్‌కు అతిపెద్ద శత్రువుగా ఎలా మారింది? అసలేం జరిగింది..

Israel Iran Enemies (Photo Credit : Google)

Updated On : October 4, 2024 / 3:35 PM IST

Israel Iran War : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది క్షిపణులతో దాడులకు దిగింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్.. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. రెండు దేశాలు బద్ధ శత్రువుల్లా మారిపోయాయి. అయితే, ఈ రెండు దేశాలు ఒకప్పుడు మిత్రులు అని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఒకరికొకరు సాయం చేసుకునేవి.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మెరుగైన దైపాక్షిక సంబంధాలు నడిచాయి. అయితే.. అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. ఫ్రెండ్స్ కాస్త ఎనిమీస్ గా మారాయి. ఇజ్రాయెల్ కు ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న ఇరాన్.. ఇప్పుడు అతిపెద్ద శత్రువుగా మారింది. అసలేం జరిగింది.. మిత్రుల మధ్య శత్రుత్వానికి కారణం ఏంటి? అందుకు దారితీసిన పరిస్థితులేంటి…

ఇజ్రాయెల్‌ను గుర్తించిన మొదటి జాబితాలో ఇరాన్…
1950లో టర్కీ తర్వాత ఇజ్రాయెల్ సార్వభౌమ రాజ్యాన్ని గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరాన్. 1947లో భారత్, యుగోస్లేవియాతో పాటు, ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా కోసం విభజన ప్రణాళికను వ్యతిరేకించింది ఇరాన్. ఒకే సమాఖ్య రాష్ట్రం ద్వారా మాత్రమే శాంతి నెలకొల్పబడుతుందని అప్పుడు వాదించింది.

ఇరాన్-ఇజ్రాయెల్ సంబంధాలు..
1950లో పహ్లావి రాజవంశం ఇరాన్ ను పాలించిన ఆ సమయంలో.. కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను కలిగి ఉన్నాయి. అరబ్-యేతర దేశం కావడంతో యూదుల రాజ్యం పొరుగున ఉన్న ఏకైక మిత్రదేశాలలో ఒకటిగా మారింది.

ఇరాన్-ఇజ్రాయెల్ వాణిజ్యం..
అరబ్ దేశాలు యూదు రాజ్యమైన ఇజ్రాయెల్ తో వ్యాపారం చేయడానికి నిరాకరించిన ఆ సమయంలో.. ఇజ్రాయెల్‌కు ప్రధాన చమురు సరఫరా చేసిన దేశం ఇరాన్. అందుకు బదులుగా.. ఇజ్రాయెల్ నుండి ఆయుధాలు, సాంకేతికత, వ్యవసాయ వస్తువులతో సహా అనేక సామాగ్రిని పొందింది ఇరాన్.

ఉమ్మడి శత్రువుతో పోరాడేందుకు చేతులు కలిపారు..
ఒకప్పుడు ఉమ్మడి శత్రువు అయిన సద్దాం హుస్సేన్ (ఇరాక్‌తో) పోరాడేందుకు ఇరాన్-ఇజ్రాయెల్ చేతులు కలిపాయి. 1960లలో ఇరాక్ నుంచి పెరుగుతున్న ముప్పును అదుపులో ఉంచడానికి.. ఇజ్రాయెల్ కి చెందిన మొసాద్, సవాక్.. ఇరాన్ కి చెందిన స్రీకెట్ పోలీసులు – కుర్దిష్ తిరుగుబాటుకు మద్దతుగా కలిసి పనిచేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ సంబంధాలపై ప్రభావం చూపిన 1979 విప్లవం…
1979 ఇరాన్ విప్లవం తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇది షా పాలనను పడగొట్టింది. దేశాన్ని అయతుల్లా పాలించే దైవపరిపాలనగా మార్చింది. ఇరాన్ కొత్త పాలకుడు అయతోల్లా ఖొమేనీ.. ఇజ్రాయెల్‌ తో ద్వైపాక్షిక సంబంధాలకు ముగింపు పలికారు. అంతేకాదు.. ఇజ్రాయెల్ ను.. ఇస్లాం శత్రువుగా, సాతానుగా ప్రకటించారు.

ఆ తర్వాతి దశాబ్దాలలో.. హెజ్బొల్లా, హమాస్, హౌతీలు, ఇరాక్‌లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్‌తో సహా ఇజ్రాయెల్ వ్యతిరేక మిలీషియాలకు ప్రాథమిక మద్దతుదారుగా ఇరాన్ మారిపోయింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య శత్రుత్వం కంటిన్యూ అవుతోంది. అలా.. ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్రువు అయిన ఇరాన్.. ఇప్పుడు బద్ధ శత్రువుగా మారిపోయింది.

Also Read : ఇజ్రాయెల్-ఇరాన్ వార్..! మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా? ఇక వినాశమేనా?