చైనా, దక్షిణ కొరియా, జర్మనీల నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పద్ధతులేంటి? కరోనా కట్టడికి బెస్ట్ టెక్నాలజీ ఎవరి దగ్గరుంది?

  • Publish Date - April 1, 2020 / 02:37 PM IST

కరోనా కట్టడిలో ఆసియా గొప్పగా సక్సెస్ అయ్యింది. జర్మనీ అద్భుతం. మిగిలిన యూరోప్ కరోనా కోరల్లోకి చిక్కితే, జర్మనీ అదుపుచేసింది. వైరస్‌ను తొక్కిపెట్టింది. కరోనాపై ఇండియా ప్రయోగించిన అస్త్రం ఒక్క లాక్ డౌనే. డాక్టర్లు లేరు. హాస్పటల్స్ లిమిటెడ్. ఒకవేళ గతి తప్పితే తట్టుకొనే శక్తిలేదు. అందుకే ముందుగానే ఎక్కడివాళ్లు అక్కడే అన్న సూత్రాన్నే నమ్ముకుంది. ఇప్పుడు ఈ మూడు దేశాలు కరోనాను ఎలా ఎదుర్కొన్నాయో స్టడీ మొదలుపెట్టింది. బేషజాలకు పోకుండా ఈ మూడు దేశాలతో సహకారం కావాలి.వాళ్ల దగ్గరున్న టెక్నాలజీని అందుకోవాలి. కరోనా కట్ట తెగుతున్న సమయంలో ఈ మూడుదేశాలే భారతదేశానికి మార్గదర్శి.

కరోనా కేసులు వేలల్లోకి చేరాయి. ఢిల్లీ ఘటనతో భారత్ నెత్తిమీద మరో బండపడింది. ఇప్పుడు ఇండియా, South Korea, Germany,China ల నుంచి కట్టింగ్ ఎడ్జ్ అంటే అత్యున్నత టెక్నాలజీ కొనడానికి ప్రయత్నిస్తోంది. వాళ్ల పద్ధతులను నిపుణులతో స్టడీ చేయిస్తోంది. కరోనా కర్వ్‌ను వాళ్లు ఎలా నేలకు దించారో అన్నివైపుల నుంచి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

కరోనా ఇప్పటివరకు ఎదురుపడిన శత్రువు. కంటికి కనిపించదు. మళ్లీమళ్లీ వచ్చిపడే ప్రమాదమూ ఉంది. అందుకే మోడీ సోమవారం, 130 మంది ఇండియన్ మిషన్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్లకు చెప్పింది ఒక్కటే.. ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ మెడిసిన్ దొరుకుతుంది? కరోనా కట్టడికి టెక్నాలజీ ఉంది? ఏ పద్ధతులు వాడితే వైరస్‌ను అడ్డుకోవచ్చు? విదేశాల్లో ఉన్న భారతీయ బృందాలకు పెద్ద పనే పెట్టారు.

నిజానికి దక్షిణ కొరియా పద్దతులకు మోడీకి బాగా నచ్చాయి. ఇంతకీ ఏం చేసింది కొరియా? టెస్ట్, టెస్ట్.. టెస్ట్. అనుమానమున్నవాళ్లను, వాళ్ల చుట్టుప్రక్కల వాళ్లను అందరికీ టెస్ట్ చేసింది. అంతేనా? అనుమానితులను డిజిటల్ ట్రాక్ చేసింది. మహమ్మారిని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ‘trace, test and treat strategy’ఇదే దక్షిణ కొరియా వ్యూహం. ప్రపంచమే ఈ విధానాన్ని మెచ్చుకుంది. మొదట్లో అందరికీ టెస్ట్ చేయక్కర్లేదు అనుకున్న ట్రంప్ కూడా కొరియా బాటలోకి వచ్చాడు. దక్షిణ కొరియా ఏ ప్రాంతాన్ని లాక్ డౌన్ చేయలేదు. వ్యాపారం అలాగే సాగనిచ్చింది. జనం వీధుల్లో తిరుగుతూనే ఉన్నారు. మార్కెట్‌కు నో ప్రొబ్లమ్. నిజానికి కరోనా వల్ల దేశానికి ఎలాంటి ఇబ్బంది లేదు.

దీనికి పూర్తిగా భిన్నం చైనాది. మనం చైనాను అడిపోసుకొంటాంకాని, మోడీ చేసింది కూడా అదే. 80వేల కేసులు, 3,300 మంది చనిపోయినా కరోనాను కట్టడిచేసిందంటే… కారణం లాక్ డౌనే. మోడీకూడా చైనా విధానాన్ని బాగా స్టడీచేస్తున్నారు. దేశాన్ని కొన్నివారాలు దిగ్బంధించైనా సరే, కరోనాను తరిమివేయాలన్నది మోడీకున్న సంకల్పం. ఈ దేశం మాత్రమేకాదు, హాంగ్ కాంగ్, తైవాన్ నుంచి కూడా medical equipment , technologyని కొనుగోలు చేయాలన్నది మోడీ విధానం. ఇప్పటికప్పుడు భారతదేశ వ్యాప్తంగా వైద్య సదుపాయాలను పెంచలేం. కనీసం కొత్త టెక్నాలజీతోనైనా బరువును కొంతైనా తగ్గించుకోవాలని అనుకుంటోంది ఇండియా.

ఇప్పటికే బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీకి ఆదేశాలెళ్లాయి. తగిన వైద్యపరికరాలు, టెక్నాలజీని కొనుగోలు చేయడానికి అక్కడి అధికారులతో మాట్లాడమని ఏకంగా పీఎంఓ ఆదేశాలిచ్చింది. ఇంతకు ముందు చాలాసార్లు, మహమ్మారిని అడ్డుకోవానికి చేయగలిగిన సహకారాన్ని అందిస్తామని చైనా చెప్పింది. ఇప్పటికిప్పుడు కనీసం 10వేల వెంటిలేటర్లను సప్లయ్ చేయడానికి చైనా రెడీ. మరోవైపు మహమ్మారిని అడ్డుకోవడంలో జర్మనీ నేర్పును భారతదేశం బాగా అవగాహన చేసుకుంటోంది.

జర్మనీ పరికరాలు, టెక్నాలజీ అంటే స్టాండర్డ్. ఒకవైపు చైనా కరోనా కిట్‌లు మాకొద్దని యూరోప్ దేశాలు అంటుంటే, నిజానికి చైనా, జర్మనీ టెక్నాలజీ, పరికరాలతోనే కరోనాను జయించింది. జర్మనీ తయారీ వెంటిలేటర్స్ అంటే చాలా ఫేమస్. డిమాండ్ కూడా. వాటితోపాటు ఐసీయూ ఎక్విప్ మెంట్‌ను భారతదేశం కొనాలనుకుంటోంది. మోడీకి బాగా ఇష్టమైన ట్రంప్ కూడా భారతదేశానికి టెస్టింగ్, మెడికల్ ఎక్విప్ మెంట్ ను పంపించడానికి సిద్ధం. భారతదేశానికి కావాల్సింది కూడా అదే.