Chinese govt: ‘చైనీస్ గవర్నమెంట్ డబ్ల్యూహెచ్ఓ అధికారులను మానిప్యులేట్ చేసింది’

Chinese Govt
Chinese govt: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులను చైనీస్ ప్రభుత్వం మానిప్యులేట్ చేసిందని అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ అంటున్నారు. వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ల్యాబొరేటరీ నుంచే కొవిడ్-19 వచ్చిందని ల్యాబ్ అధికారే చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
టైమ్స్ నౌ అనే ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన బోల్టన్.. కరోనావైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో మూలం కనుక్కోవడానికి చైనా పూర్తి కోఆపరేషన్ అందించాలని అన్నారు. ఆ దర్యాప్తు కారణంగా బీజింగ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటిదో తెలుస్తుంది. ఇది పూర్తిగా బయోలాజికల్ ఆయుధ ప్రోగ్రామే.
అమెరికా, వెస్టరన్ యూరప్, జపాన్ లలో డబ్ల్యూహెచ్ఓ అధికారులు కరోనావైరస్ గురించి సాక్ష్యం బయటపడకుండా చైనాకు సాయం చేస్తున్నారని ఒపీనియన్ పోల్ ద్వారా తెలుసుకున్నారు. ‘ప్రెసిడెంట్ జో బైడెన్ పబ్లిక్ ఒపినీయన్ అర్థం చేసుకుని.. చైనాకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసుకున్నారు’ అని అన్నారు.
ఒక వేళ చైనా ఇవేమీ చేయకపోయి ఉంటే విచారణకు అడ్డు ఎందుకు చెప్పాలి. స్వేచ్ఛా సమాజంలో బీజింగ్ లో కొనసాగుతున్న నియంతృత్వ పాలనను అడ్డుకోవాలి. అని ఆయన అభిప్రాయపడ్డారు.