WHO: ఆంక్షలు ఎత్తేస్తే.. వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రమాదం!
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

Who Suggest To All Cuntries About Travel Rules
who suggest to all cuntries about travel rules: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు ప్రయాణాలపై విధించిన నిబంధనలను సడలించాలని ఆలోచనలో ఉన్నాయి. ఈ తరుణంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో నిబంధనలు సడలిస్తే వ్యాక్సిన్ తీసుకోని ప్రజలు చాలా ఇబ్బంది పడతారని పేర్కొంది.
ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా దేశాలు అందరికి వ్యాక్సిన్ అందించలేని స్థితిలో ఉన్నాయని వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.