Toshakhana List: ఒక్క ఇమ్రాన్ ఖానే కాదు.. తోషాఖానా నుంచి బహుమతులు తీసుకున్న పాకిస్తాన్ మాజీ అధినేతలు, కుటుంబ సభ్యుల మొత్తం చిట్టా విప్పిన ప్రభుత్వం

అదే నెలలో ఆయన భార్య బుష్రా బీబీ 10 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన నెక్లెస్ ను 24 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన బ్రాస్లెట్, 28 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన ఉంగరం, 18 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన చెవిపోగులు మొత్తంగా 90 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువ గల బహుమతులు ఉన్నట్లు గుర్తించారు

Toshakhana List: ఒక్క ఇమ్రాన్ ఖానే కాదు.. తోషాఖానా నుంచి బహుమతులు తీసుకున్న పాకిస్తాన్ మాజీ అధినేతలు, కుటుంబ సభ్యుల మొత్తం చిట్టా విప్పిన ప్రభుత్వం

Pakistan: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ దోషి అని ట్రయల్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు 1,00,000 పాకిస్తాన్ రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానాను చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఇమ్రాన్‌పై నమోదైన ఆరోపణలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ తెలిపారు.

Earthquake : జమ్మూకశ్మీరులో మళ్లీ భూకంపం…వరుస భూకంపాలతో భయాందోళనలు

ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ఎన్నికల కమిషన్‌కు బూటకపు సమాచారాన్ని సమర్పించారని తెలిపారు. ఆయన అవినీతికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు పేర్కొంది. అయితే దీనికి ముందు తోషాఖానా కేసుకు సంబంధించి ఇమ్రాన్ అవినీతి చిట్టా అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ఒక డేటా వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో 38లక్షల పాకిస్తానీ రూపాయల విలువ గల గ్రాఫ్ వాచ్‌తో సహా ఐదు ఖరీదైన చేతి గడియారాలు (ప్రస్తుత ధరల ప్రకారం సుమారు 11 లక్షల రూపాయలు) బహుమతులుగా అందుకున్నారని ఆ డేటాలో పేర్కొన్నారు. అక్టోబర్ 2018లో రెండు లక్షల పాకిస్తాన్ రూపాయల చెల్లించిన తర్వాత ఖాన్ ఈ బహుమతులను తన వద్దే ఉంచుకున్నారు.

సెప్టెంబరు 2018లో ఖాన్ 8.55 కోట్ల పాకిస్తాన్ రూపాయల విలువైన గ్రాఫ్ చేతి గడియారం, 56 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన ఒక జత కఫ్‌లింక్‌లు, 15 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన పెన్ను, 87 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన ఉంగరాలను కేవలం 20 లక్షల పాకిస్తాన్ రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారట. అలాగే 15 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన రోలెక్స్‌ను కూడా కేవలం 2.94 లక్షలకే సొంతం చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు.. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు..!

నవంబర్ 2018లో ఆయన 9 లక్షల విలువైన మరొక రోలెక్స్‌ని అలాగే ఉంచుకున్నారట. దానితో పాటు మరికొన్ని ఇతర వస్తువుల కోసం కేవలం 3.3 పాకిస్తాన్ రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. ఇక అక్టోబరు 2019లో ఆయన బాక్స్‌డ్ వాచ్‌ని కలిగి ఉన్నారు. ఇక దీని విలువ 19 లక్షల పాకిస్తాన్ రూపాయలని అంటున్నారు. అలాగే సెప్టెంబర్ 2020లో మరొక రోలెక్స్ ని 44 లక్షల పాకిస్తాన్ రూపాయలని చెప్పారు.

అదే నెలలో ఆయన భార్య బుష్రా బీబీ 10 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన నెక్లెస్ ను 24 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన బ్రాస్లెట్, 28 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన ఉంగరం, 18 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన చెవిపోగులు మొత్తంగా 90 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువ గల బహుమతులు ఉన్నట్లు గుర్తించారు. ఇమ్రాన్ ఖాన్ తనకు లభించిన కొన్ని బహుమతుల వివరాలను పంచుకోలేదని ఆరోపణలు వచ్చిన అనంతరం ఈ కొత్త విధానం మొదలైంది.

AP Police Officers : పోలీసులను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర.. తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలి

2002 నుంచి 2022 మధ్య దేశ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఫెడరల్ క్యాబినెట్ సభ్యులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ జనరల్‌లు, న్యాయమూర్తులు, జర్నలిస్టులతో సహా ప్రభుత్వ కార్యాలయ హోల్డర్‌లు తమ వద్ద ఉంచుకున్న విదేశీ బహుమతుల వివరాలను పాకిస్తాన్ బహిరంగపరిచింది. అధ్యక్షఉడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధానులు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, షౌకత్ అజీజ్, యూసుఫ్ రజా గిలానీ, షాహిద్ ఖాకాన్ అబ్బాసీ, రాజా పర్వైజ్ అష్రఫ్, జఫరుల్లా ఖాన్ జమాలీ, మాజీ అధ్యక్షులు తోషాఖానా బహుమతుల ద్వారా లబ్ది పొందిన వారిలో ఉన్నారు. ఆసిఫ్ అలీ జర్దారీ, పర్వేజ్ ముషారఫ్ వంటి ఇతర అగ్ర రాజకీయ నాయకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

2002 నుంచి 2022 మధ్య పాకిస్తాన్ అగ్ర రాజకీయ నాయకులు తమ వద్దే ఉంచుకున్న బహుమతుల జాబితా ఇది:
నవాజ్ షరీఫ్
మూడుసార్లు ప్రధానమంత్రి అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్.. 2008 నుంచి 2017 మధ్యకాలంలో, మెర్సిడెస్ బెంజ్, రోలెక్స్, పియాజెట్‌తో సహా అనేక అత్యాధునిక చేతి గడియారాలు, 11.9 కోట్ల పాకిస్తాన్ రూపాయల విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను తన వద్దే ఉంచుకున్నారు. వాటికి ఆయన కేవలం 2.4 కోట్ల పాకిస్తాన్ రూపాయలే చెల్లించారట.

ఆసిఫ్ అలీ జర్దారీ
మాజీ అధ్యక్షుడు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో-ఛైర్‌పర్సన్ అసిఫ్ అలీ జర్దారీ.. జనవరి 2009లో 10 కోట్ల పాకిస్తాన్ రూపాయలకు పైగా విలువైన బీఎండబ్ల్యూ కారు, టయోటా లెక్సస్‌ను కేవలం 1.6 కోట్ల పాకిస్తాన్ రూపాయలకు తన వద్ద ఉంచుకున్నారు. బీఎండబ్ల్యూ కారుకు కేవలం 40 లక్షల పాకిస్తాన్ రూపాయలు మాత్రమే చెల్లించారట. ఇక 2011లో 3.2 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన రెండు చేతి గడియారాలు, ఒక తుపాకీ, ఇతర వస్తువులను కేవలం 6.6 లక్షల పాకిస్తాన్ రూపాయలు మాత్రమే చెల్లించారట.

ఆరిఫ్ అల్వీ
పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షఉడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ భార్య సమీనా అల్వీ.. అక్టోబర్ 2019లో 11 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన నెక్లెస్‌ని తీసుకున్నారు. దానికి ఆమె కేవలం 8.6 లక్షలు మాత్రమే చెల్లించారు. వీటితో పాటు ఇతర వస్తువులను కూడా తీసుకున్నారు. ఇక అధ్యక్షుడు అల్వీ స్వయంగా ఫిబ్రవరి 2022లో 12 లక్షల పాకిస్తాన్ రూపాయల రోలెక్స్ చేతి గడియారాన్ని 2.2 లక్షలకే సొంతం చేసుకున్నారు.

ఇతర నాయకులు
*మాజీ ప్రధాని, జాతీయ అసెంబ్లీ స్పీకర్ రాజా పెర్వైజ్ అష్రఫ్ నవంబర్ 2012లో 8.9 లక్షల పాకిస్తాన్ రూపాయల గ్రాఫ్ చేతి గడియారాన్ని, ఇతర వస్తువులకు రెండు లక్షలు చెల్లించి తన వద్ద ఉంచుకున్నారు.
*అక్టోబర్ 2017లో మాజీ ప్రీమియర్ షాహిద్ ఖాకాన్ అబ్బాసీ.. 1.5 కోట్ల విలువైన హబ్లాట్ చేతి గడియారాన్ని 12 లక్షల విలువైన ఒక జత కఫ్‌లింక్‌లను, 15 లక్షల విలువైన పెన్నును, 30 లక్షల విలువైన ఉంగరాన్ని, 18 లక్షల విలువైన ప్రార్థన పూసలను కేవలం 45 లక్షల పాకిస్తాన్ రూపాయలు చెల్లించి తన వద్ద ఉంచుకున్నారు. ఆయన భార్య సమీనా షాహిద్ కూడా కోటి రూపాయల ఆభరణాల సెట్‌ను 20 లక్షలకు దక్కించుకున్నారు.
*నవంబర్ 2017లో అబ్బాసీ 2.3 కోట్ల రోలెక్స్ వాచ్ బాక్స్ సెట్‌ను కేవలం 45 లక్షలు చెల్లించారు. ఏప్రిల్ 2018లో ఆయన 2.5 కోట్ల విలువైన మరో రోలెక్స్ చేతి గడియారాన్ని, ఇతర వస్తువులకు 52 లక్షలు మాత్రమే చెల్లించారు.
*మాజీ ప్రధాన మంత్రి యూసుఫ్ రజా గిలానీ భార్య ఫౌజియా గిలానీ.. డిసెంబర్ 2009లో 20 లక్షల ఆభరణాలకు 3.2 లక్షల పాకిస్తాన్ రూపాయలు మాత్రమే చెల్లించారు.