మేమిద్దరం పెళ్లి చేసుకోవడం లేదు.. విడిపోతున్నాం: అంజలి, సూఫీ

తాను చేసిన తప్పుల కారణంగానే విడిపోవాల్సి వచ్చిందని సూఫీ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. అంజలీని తాను చీట్ చేశానని చెప్పారు.

మేమిద్దరం పెళ్లి చేసుకోవడం లేదు.. విడిపోతున్నాం: అంజలి, సూఫీ

Anjali Chakra, Sufi Malik: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంజలి చక్ర, సూఫీ మాలిక్ తమ అభిమానులకు షాక్ ఇచ్చారు. తాము పెళ్లిచేసుకోవడం లేదని, విడిపోతున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను చేసిన తప్పుల కారణంగానే విడిపోవాల్సి వచ్చిందని సూఫీ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. అంజలీని తాను చీట్ చేశానని చెప్పారు. కాగా, సూఫీపై తనకు ఎటువంటి కోపం లేదని, ఆమెతో గడిపిన రోజులను తానెప్పటికీ మరిచిపోలేనని అంజలి అన్నారు.

భారతదేశానికి చెందిన అంజలి, పాకిస్థాన్‌కు చెందిన సూఫీ అమెరికాలో ఉంటున్నారు. వీరిద్దరూ స్వలింగ సంపర్కులు అని తెలియడంతో 2019లో పతాక శీర్షికలకు ఎక్కారు. పలు ఆసియా దేశాలలో LGBTQ+ సమస్యలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్‌షిప్‌ సంచలనంగా మారింది. తాజాగా తాము విడిపోతున్నట్టు ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు. మొదట ఈ వార్తలను చాలా మంది నమ్మలేదు. అంజలి కూడా స్పందించడంతో క్లారిటీ వచ్చింది. సూఫీ అండ్ అంజలి పేరుతో వీరికి యూట్యూబ్ చానల్ ఉంది. దీనికి 1.36 లక్షల మంది స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. ఈ యూట్యూబ్ చానల్ ఇకముందు ఎలా నడుపుతారనేది వెల్లడి కాలేదు.

ఎవరీ అంజలి చక్ర?
1. న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న అంజలి చక్ర ఈవెంట్ ప్లానర్, కంటెంట్ క్రియేటర్‌గా ప‌నిచేస్తున్నారు.
2. లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.
3. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకి చెందిన అంజలి చక్ర.. సూఫీ కోసమే న్యూయార్క్‌కు వచ్చారు.
4. కొన్నేళ్లు హెల్త్‌కేర్‌లో పనిచేసిన తర్వాత ఈవెంట్ ప్లానర్‌గా కెరీర్ మొదలు పెట్టారు.
5. ట్రావెల్, బ్యూటీ, ఈవెంట్ ప్లానింగ్ విషయాలను తన బ్లాగ్ ద్వారా షేర్ చేస్తుంటారు. పరోపకారం, తోటపని ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు.

సూఫీ మాలిక్ ఎవరు?
1. సూఫీ మాలిక్(27).. లైఫ్ స్టైల్, ఫ్యాషన్ కంటెంట్‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు.
2. ఇస్లాం యొక్క అంతర్గత ఆధ్యాత్మిక కోణమైన సూఫీ తత్వశాస్త్రం నుంచి ఆమె ప్రేరణ పొందారు.
3. ఫోటోగ్రఫీపై సూఫీకి ఆసక్తి మెండు. ఆమె తీసిన ఫొటోలు ఉత్తర అమెరికాలో అతిపెద్ద పాప్-అప్ ఆర్ట్ ఎగ్జిబిషన్.. పాన్‌కేక్స్ & బూజ్ ఆర్ట్ షోలో ప్రదర్శించారు.
4. సూఫీ మాలిక్ ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నారు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెల్ కంటెంట్‌ క్రియేటర్‌గా కొనసాగుతున్నారు.
5. అంజలి చక్రతో రిలేషన్‌షిప్‌ కారణంగానే ఆమె వెలుగులోకి వచ్చారు. వీరిద్దరి జాయింట్ Youtube ఛానెల్‌లో సూఫీ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు.

Also Read: ఐపీఎల్ నిర్వాహుకులపై హీరోయిన్ సీరియస్.. హార్దిక్ పాండ్య బౌలింగ్ సమయంలో..