IPL 2024 : ఐపీఎల్ నిర్వాహుకులపై హీరోయిన్ సీరియస్.. హార్దిక్ పాండ్య బౌలింగ్ సమయంలో..

ఇటీవల జరిగిన ముంబై, గుజరాత్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య బౌలింగ్ సమయంలో జరిగిన ఓ విషయం పై హీరోయిన్ వేదిక సీరియస్ అయ్యారు.

IPL 2024 : ఐపీఎల్ నిర్వాహుకులపై హీరోయిన్ సీరియస్.. హార్దిక్ పాండ్య బౌలింగ్ సమయంలో..

Heroine Vedhika serious about IPL management on dog video

Vedhika : సౌత్ లోని పలు భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్న హీరోయిన్ వేదిక.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. జీరో సైజు నడుము అందాలతో ఫోటోషూట్స్ చేస్తూ నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంటారు. అయితే తాజాగా ఈ భామ.. ఐపీఎల్ నిర్వాహుకుల పై సీరియస్ అవుతూ ఓ పోస్ట్ వేశారు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె దేని గురించి సీరియస్ అయ్యారు..?

ఇటీవల అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై అండ్ గుజరాత్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై టీం కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తున్న సమయంలో ఓ కుక్క అందర్నీ తప్పించుకుంటూ గ్రౌండ్ లోకి దూసుకు వచ్చింది. స్టేడియం నిర్వాహుకులతో పాటు హార్దిక్ కూడా ఆ కుక్కని ఆపే ప్రయత్నం చేసారు. కానీ ఆ కుక్క మాత్రం ఎక్కడా ఆగకుండా స్టేడియం మొత్తం తిరిగేసింది.

Also read : Naga Vamsi : రివ్యూయర్‌తో నిర్మాత డిబేట్.. భీమ్లా నాయక్, గుంటూరు కారం, సలార్ గురించి..

ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోల్లో ఒకదాని పై వేదిక రియాక్ట్ అయ్యారు. కుక్కని పట్టుకునే ప్రయత్నంలో స్టేడియం నిర్వాహుకులు దానిని కాలితో కొడుతూ కనిపించరు. ఈ ప్రవర్తన పైనే వేదిక సీరియస్ అయ్యారు. మూగజీవం విషయంలో ఎలా ప్రవర్తించాలో కూడా మనుషులకు తెలియడం లేదు. వాటిని గౌరవించడం, వాటి పట్ల ప్రేమ చూపించడం వంటివి ఇంకెప్పుడు నేర్చుకుంటారు అంటూ ప్రశ్నించారు.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

ఈ పోస్టు పై నెటిజెన్స్ పలు విధాలుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వేదిక జంతుప్రేమికురాలు. తన అందాల ఫోటోషూట్స్ తో పాటు అప్పుడప్పుడు.. జంతు సంరక్షణకు సంబంధించిన పోస్టులను కూడా వేస్తుంటారు. ఈక్రమంలోనే ఇప్పుడు ఈ కుక్క విషయంలో కూడా ఎమోషనల్ అవుతూ పోస్టు వేశారు.