Naga Vamsi : రివ్యూయర్‌తో నిర్మాత డిబేట్.. భీమ్లా నాయక్, గుంటూరు కారం, సలార్ గురించి..

రివ్యూయర్‌తో నిర్మాత నాగవంశీ డిబేట్. భీమ్లా నాయక్, గుంటూరు కారం, సలార్ సినిమా రివ్యూలు గురించి మాట్లాడుతూ..

Naga Vamsi : రివ్యూయర్‌తో నిర్మాత డిబేట్.. భీమ్లా నాయక్, గుంటూరు కారం, సలార్ గురించి..

Naga Vamsi debate with reviewer about bheemla nayak guntur kaaram salaar

Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా మేకర్స్‌కి, రివ్యూయర్స్‌కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. సినిమా రిలీజైన గంటల్లోనే తమ రివ్యూలను తెలియజేస్తూ.. మొదటి షోకే దాని రిజల్ట్ ని తేల్చేస్తున్నారు. అయితే అది కేవలం ఆ రివ్యూయర్ వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. ఇక ఆ రివ్యూయర్ కామెంట్స్ చూసి చాలామంది ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడం మానేస్తున్నారు. కానీ ఆ తరువాత ఓటీటీకి వచ్చిన తరువాత చూసి.. సినిమా బాగానే ఉంది కదా అని ఫీల్ అవుతున్నారు.

ఇలా ఒకరి వ్యక్తిగత రివ్యూ వల్ల హిట్ కావాల్సిన సినిమా కూడా కలెక్షన్స్ లేక కమర్షియల్ గా విఫలం అవుతుంది. దీంతో ఈ రివ్యూయర్ల విషయం చిత్ర నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. దీని పై పలువురు స్టార్ట్ నిర్మాతలు రియాక్ట్ అవుతూ.. “మొదటి మూడు రోజులు రివ్యూ ఇవ్వడం ఆపండి. సినిమా ఎలా ఉందో ఆడియన్స్ ని డిసైడ్ చేయనివ్వండి” అంటూ కోరారు. కానీ రివ్యూయర్లు మాత్రం తమ పని ఎవరి మాట పట్టించుకోకుండా చేసుకుంటూ పోతున్నారు.

తాజాగా ఈ విషయం పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఓ ప్రముఖ యూట్యూబ్ రివ్యూయర్ తో డిబేట్ కి దిగారు. ఈక్రమంలోనే సలార్, భీమ్లా నాయక్, గుంటూరు కారం సినిమాల గురించి చర్చించారు. సలార్ సినిమాలో లాజిక్ లేని ఓవర్ ఎలివేషన్స్ ఉన్నాయని రివ్యూయర్ అన్న కామెంట్స్ కి నాగవంశీ బదులిస్తూ.. “ఫ్యాన్స్ కోరుకునేది హీరోయిజం గాని లాజిక్స్ కాదు. అలా లాజిక్ చూస్తే ఏ సినిమాలో హీరోయిజం కనిపించదు” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Game Changer : మరోసారి చర్చగా మారిన ‘జరగండి’ సాంగ్ బడ్జెట్.. ఆ ఖర్చు వీడియోలో కనిపిస్తుందా..!

ఇక ‘భీమ్లా నాయక్’ రిలీజ్ సమయంలో అమెరికాలో మంచు తుఫాను వల్ల ఒక షోకి జనాలు రాకపోతే.. ఆడియన్స్ లేరనే పాయింట్ ని హైలైట్ చేసి చూపించి, తుఫాన్ మాటని జస్ట్ అలా చెప్పి వదిలేసారు. అది కూడా సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. నిజం ఏంటో కరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం మీకు ఉంది కదా అంటూ నాగవంశీ నిలదీశారు.

అలాగే గుంటూరు కారం విషయంలో రివ్యూయర్స్ కొంచెం ఎక్కువగానే డ్యూటీ చేశారని అసహనం వ్యక్తం చేశారు. “మాస్ టైటిల్ పెట్టి ఫ్యామిలీ సినిమా చూపించారని కొందరు అంటారు, మరికొందరేమో.. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్ లేదు అంటారు. సినిమాలోని గోడౌన్ సీన్ లో శ్రీలీల డాన్స్ గురించి అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వారందరు ఆ సీన్ లో మహేష్ డాన్స్ ని ఎంజాయ్ చేసారు. కానీ దాని గురించి ఎవరు మాట్లాడారు. రచన పై ఇన్నాళ్ల అనుభవం ఉన్న త్రివిక్రమ్ గారికి సినిమా ఎలా చేయాలో తెలియదా” అంటూ అసహనం వ్యక్తం చేసారు.