Woman Principal: ప్రవక్తనని చెప్పుకున్న మహిళా ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష

ఓ మహిళా ప్రిన్సిపాల్ తనకు తానుగా ప్రవక్త చెప్పుకుంటుందనే నేరంలో పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 295సీ ప్రకారం.. ఉరిశిక్ష విధించారు.

Woman Principal: ప్రవక్తనని చెప్పుకున్న మహిళా ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష

Death Sentence

Updated On : September 28, 2021 / 9:38 PM IST

Woman Principal: ఓ మహిళా ప్రిన్సిపాల్ తనకు తానుగా ప్రవక్త చెప్పుకుంటుందనే నేరంలో పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 295సీ ప్రకారం.. ఉరిశిక్ష విధించారు. దోషి సల్మాన్ తన్వీర్‌కు 50వేల పాకిస్తాన్ రూపాయల జరిమానా కూడా తప్పలేదు. ఆమెపై మోపిన నేరారోపణ నుంచి నిర్దోషిగా నిరూపించుకోలేకపోయింది కాబట్టి శిక్ష ఖరారు అయింది.

ఓనర్ కమ్ ప్రిన్సిపాల్ అయిన మహిళ ప్రైవేట్ స్కూల్ నడుపుతుంది. అక్కడే ఆమె ప్రవక్తగా చెప్పుకుంటూ కాపీలు రాసి వాటిని జిరాక్స్ తీయించి ప్రచారం చేసుకుంటుంది. అలా తాను ప్రవక్తనని ప్రచారం మొదలుపెట్టింది. మహిళా కౌన్సిల్ ముహమ్మద్ రంజాన్ ఆరోపణలతో విషయం వెలుగులోకి వచ్చింది.

మానసికంగా సరిగా లేకపోవడంతో అలా ప్రవర్తించిందా అనే అనుమానంలో ఆమెపై మెంటల్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. అంతకుముందే పంచిపెట్టిన ఫొటోకాపీలు ట్యాంపరింగ్ చేసినవి కావని ఆమె రాసినవేనని తేల్చారు.

…………………………….. : హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కాంగ్రెస్ అభ్యంతరం

దీనిపై స్టేట్ ప్రోసిక్యూటర్ సాదియా ఆరిఫ్, అడ్వకేట్ గులామ్ ముస్తఫా చౌదరి జరిపిన విచారణలో వాదనలు, డాక్యుమెంటరీ సాక్ష్యాలను పరిగణించారు. ఆమె చేసిన పనులను వేరే ఉద్దేశ్యంతో చేశానని నిరూపించుకోలేకపోయిన పక్షంలో ఆమెకు శిక్ష తప్పలేదని ఆరిఫ్ అంటున్నారు.

ఒకవేళ ఆమె మానసికంగా సరిగా లేకపోయి ఉంటే సొంతంగా రాయడం, ఫొటోకాపీలు పంచిబెట్టడం వంటివి చేసి ఉండేది కాదని జడ్జి తేల్చేశారు.