Viral video : మొసలిని చెప్పుతో బెదిరించిన మ‌హిళ‌..ఆ మొసలి ఏం చేసిందంటే..!!

తనవైపు దూసుకొస్తున్న మొసలిని ఓ మహిళ చెప్పుతో చెదిరించింది. దాంతో ఆమొసలి వెనక్కి వెళ్లిపోయింది.ఎందుకంటారు? ఆ మొసలికి ఆమెంటే భయమా? చెప్పు అంటే భయమా?

Viral video : మొసలిని చెప్పుతో బెదిరించిన మ‌హిళ‌..ఆ మొసలి ఏం చేసిందంటే..!!

Woman Scrares Off Alligator With Chappal

Updated On : November 13, 2021 / 6:24 PM IST

woman scrares off alligator with chappal : స్థాన బలిమి అని పెద్దలు ఊరికనే అనలేదని ఈ వీడియో చూస్తే మరోసారి అర్థం అవుతుంది.మొసలి నీటిలో ఉంటే దాని బలం ఎంతంటే..భారీ ఏనుగుని కూడా చంపేయగలదు. అదే నేలమీద ఉంటే దాని పప్పులు ఉడకవ్. అందుకే నీటిలో ఉండే వేటాడి ఆహారం తింటుంది. అలా ఓ నీటి ప్ర‌వాహం ద‌గ్గ‌ర గట్టుమీద ఉన్న కుక్కపిల్లను చూసిన మొసలు ఆశగా నీటిలో వేగంగా ఊదురుకుంటు వస్తుండగా..ఓ మహిళ చెప్పు తీసి బెదిరించేసరికి తోకముడిచి వెనక్కు వెళ్లిపోయిందా మొసలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ భారీ మొసలికి చెప్పుతో థమ్కీ ఇచ్చిదంటూ నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో ఓ నీటి ప్ర‌వాహం ద‌గ్గ‌ర నిలబడి ఉంది. ఆమె కుక్క అక్కడక్కడే తిరుగతు పచార్లు చేస్తోంది. అదే సమయంలో ఆ సరస్సులో ఉన్న మొసలు కుక్కను చూసి వేగంగా ఒడ్డుకు వస్తోంది. అలా వస్తున్న మొసలిని ఆ మహిళ చూసింది. కానీ ఏమాత్రం భయపడలేదు.

Read more : Viral Duck : ‘యూ బ్లడీ ఫూల్’ అని తిడుతున్న బాతు

అలా ముందుకు దూసుకొస్తున్న మొస‌లిని అలా చూస్తు నిలబడింది. ఆ మొసలికాస్త ధైర్యం చేస్తే ఆమె గతి ఏమయ్యేదో గానీ ఆమె ధైర్యాన్ని మత్రం మెచ్చుకోవచ్చు. ఆ మొసలి తనవైపు వేగంగా దూసుకొస్తున్నా ఆమె భయపడలేదు సరికదా..ఆ మొసలు దగ్గరకంటా వచ్చాక.. త‌న చెప్పు తీసి ‘దగ్గరకొస్తే జాగ్రత్త’ అంటున్నట్లుగా బెదిరించింది. దీంతో మరి ఆ మొసలి భయపడిందో లేక మరేమో గానీ ఆ మొస‌లి అక్క‌డి నుంచి వెన‌క్కి తిరిగి నీళ్ల‌లోకి వెళ్లిపోయింది.

Read more : Singing Ringing Tree : గాలి స్థాయిని బట్టి పాటలు పాడే చెట్టు

ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తే..వార్నీ మొసలిని చెప్పుతో కూడా ఇలా బెదరించొచ్చా? మొసలికి చెప్పు అంటే భయమా?లేక ఆమె అంటే భయపడి వెళ్లిపోందా? అనిపిస్తోంది. తన బెదిరింపులకు మొసలి తోక ముడిచిందని ఆమె హ్యాపీగా ఫీల్ అయినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఇక్కడ ఇంటో విషయం ఏమిటంటే ఈ నీటిలో చాలా మొసళ్లే ఉన్నట్లుగాన్నాయి. ఈవీడియోలో మాత్రం రెండు మొసళ్లు కనిపిస్తున్నాయి.