Woman Sleep : మహిళకు వింత అనుభవం.. రెండు నెలలుగా శవంతోనే..!
అమెరికాలో మహిళకు వింత అనుభవం ఎదురైంది. తనకు తెలియకుండానే రెండు నెలలుగా శవంతోనే నిద్రించింది. ఆ విషయం తెలిసిన తర్వాత షాక్ అయింది.

Deadbody, Rigan Belly, Covid Cases, Fish Smells, Reagan Baylee, Dead Fish
Woman slept three feet away : అమెరికాలో మహిళకు వింత అనుభవం ఎదురైంది. తనకు తెలియకుండానే రెండు నెలలుగా శవంతోనే నిద్రించింది. ఆ విషయం తెలిసిన తర్వాత షాక్ అయింది. కరోనా ఉదృతి పెరిగిన సమయంలో అమెరికన్లు చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో అమెరికాకు చెందిన ఓ మహిళకు వింతఅనుభవం ఎదురైంది.
కరోనా కేసులు అధికంగా ఉన్న రోజుల్లో కేవలం మూడు అడుగుల దూరంలో 8 వారాలపాటు శవంతో గడిపింది. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో రిగాన్ బెల్లీ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ప్రతిరోజు హఠాత్తుగా అపార్ట్‌మెంట్‌లో దుర్వాసన రావడం ప్రారంభించింది.
Garuda : కుటుంబానికి రూ.10వేలు.. ఏపీలో మరో కొత్త పథకం
ఆ వాసనకి తలనొప్పి, రాత్రుల్లు నిద్రపట్టక ఆరోగ్యం కూడా పాడైంది. ఇంట్లో పురుగులు సాలెపురుగులు పెరిగిపోయాయి. వెంటనే ఆమె అపార్ట్‌మెంట్ మేనేజర్‌కి ఫిర్యాదు చేసింది. చనిపోయిన చేప వాసన వస్తోందన్నారు. దరిదాపుల్లో ఎక్కడా చెరువు లేదు. పక్కింటి కుక్క చచ్చిపోయిందనే కంగారు పడతారేమోనని మేనేజర్ చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. దుర్వాసన భరించలేక మేనేజర్‌ని రప్పించి అపార్ట్‌మెంట్ బ్లాక్‌ను పరిశీలించారు. పక్క అపార్ట్‌మెంట్ నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది.
మాస్టర్ కీతో ఇంటి తలుపు తీయగా అస్థిపంజరం ఉంది. అందరూ షాక్ అయ్యారు. ఆమె రూంలో మరణించిన వ్యక్తి ప్లాట్‌కి కేవలం 3 అడుగుల దూరంలో ఉంది. ఆమె ఆ రూంలో పడుకుంది. ఆమెకు అసలు అక్కడ శవం ఉందని గుర్తించలేదట. ఆ అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని రిగాన్ బెల్లీ టిక్‌టాక్ ద్వారా షేర్ చేసింది.
Old Woman Fighting : బజారులో బరిగీసి కొట్టుకున్న బామ్మలు, ఈ వారం మోస్ట్ ఫన్నీ వీడియో!